యాంటీ ర్యాగింగ్ పోస్టర్ల ఆవిష్కరణ..

Sat,July 20, 2019 05:36 AM

ఖమ్మం లీగల్, జూలై 19 : కళాశాలలు, హాస్టళ్లు, బస్సుల్లో ర్యాగింగ్ నిరోధించడమే లక్ష్యంగా జిల్లా న్యాయసేవాసంస్థ ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు చేపట్టింది. నేడు పలు కళాశాలల్లో విద్యార్థులకు ర్యాగింగ్ పట్ల అవగాహన సదస్సులు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన యాంటీ ర్యాగింగ్ పోస్టర్లను శుక్రవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, న్యాయసేవాసంస్థ చైర్మన్ ఎం లక్ష్మణ్ ఆవిష్కరించారు. వివిధ పద్దతుల్లో ర్యాగింగ్, వాటికి గల శిక్షలను వివరిస్తూ ఈ పోస్టర్లను తయారు చేయించారు. శనివారం మొత్తం ఐదు కళాశాలల్లో నిర్వహించనున్న అవగాహన సదస్సుల్లో వీటిని పంపిణీ చేయనున్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ.. ర్యాగింగ్ వల్ల విద్యార్థుల జీవితాలు చిన్నాభిన్నమయ్యే అవకాశం ఉన్నందున విద్యాసంస్థల యాజమాన్యాలు, తల్లిదండ్రులు తమ పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. జిల్లా న్యాయసేవాసంస్థ ఆధ్వర్యంలో శనివారం మధ్యాహ్నం 2.30గంటలకు మమత మెడికల్ కాలేజీ, ఎస్‌ఆర్ అండ్ బీజీఎన్‌ఆర్ డిగ్రీ కళాశాలతోపాటు కిట్స్, ప్రియదర్శిని, విజయ ఇంజనీరింగ్ కళాశాలల్లో అవగాహన సదస్సులు నిర్వహించనున్నామని తెలిపారు. జిల్లాలోని ఇతర కళాశాలల్లోనూ ఇలాంటి యాంటీ ర్యాగింగ్ అవగాహన కార్యక్రమాలు త్వరలో నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో న్యాయసేవాసంస్థ న్యాయమూర్తి కే వినోద్‌కుమార్ పాల్గొన్నారు.

152
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles