విద్యాభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి

Sun,July 21, 2019 12:14 AM

వైరా, నమస్తేతెలంగాణ, జూలై 20 : రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధికి సీఎం కేసీఆర్ విశేష కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్ అన్నారు. మండలంలోని రెబ్బవరం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో నూతనంగా ఏర్పాటు చేసిన డిజిటల్ కంప్యూటర్ ల్యాబ్‌ను రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజుతో కలిసి ఆయన శనివారం ప్రారంభించారు. ముందుగా ఎమ్మెల్యే రాములునాయక్, కొండబాల కోటేశ్వరరావు, లింగాల కమలరాజుకు గ్రామస్తులు, ,విద్యార్థులు ఘన స్వాగతం పలికారు. అనంతరం జరిగిన సభలో రాములునాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు. ప్రధానంగా ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రభుత్వం ఉచితంగా ఏకరూప దుస్తులు, పాఠ్య పుస్తకాలను పంపిణీ చేస్తుందని వివరించారు. అంతేకాకుండా నాణ్యమైన మద్యాహ్న భోజనాన్ని విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తుందని పేర్కొన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా మన రాష్ట్రంలో సీఎం కేసీఆర్ వందల సంఖ్యలో గురుకుల పాఠశాలలను నూతనంగా ఏర్పాటు చేశారని కొనియాడారు. ఈ పాఠశాలల్లో వేలాది మంది నిరుపేద విద్యర్థులకు నాణ్యమైన విద్యాబుద్దులు నేర్పుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరారు. జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నేర్చుకున్న విద్యార్థులు ఉన్నతమైన స్థానాల్లో స్థిరపడ్డారని చెప్పారు. కార్యక్రమంలో వైరా ఎంపీపీ వేల్పుల పావని, జడ్పీటీసీ నంబూరి కనకదుర్గ, వైరా ఎంఈవో కొత్తపల్లి వెంకటేశ్వరరావు, సర్పంచ్ సాదం రామారావు, ఎంపీటీసీ రాయల రమేశ్ తదితరులు పాల్గొన్నారు.

160
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles