గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తా...

Sat,August 10, 2019 04:06 AM

బోనకల్లు, ఆగస్టు9: గ్రామాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తానని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం మండలంలోని చిన్నబీరవల్లి, నారాయణపురం, చొప్పకట్లపాలెం, గోవిందాపురం-ఎల్ గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు ఎంపీ నామా నాగేశ్వరరావును క్యాంపు కార్యాలయంలో కలిసి వినతిపత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ నామా మాట్లాడుతూ.. జిల్లాలో ప్రతి గ్రామాన్ని నిధులు కేటాయిస్తానని, వీటి ద్వారా గ్రామాల్లో అంతర్గత రోడ్ల నిర్మాణాలు నిర్మించేలా చర్యలు తీసుకుంటానన్నారు. అనంతరం గ్రామాల మధ్య ఉన్న బీటీ, సీసీరోడ్ల ఏర్పాటుకు కృషి చేస్తానన్నారు. తన పరిధిలో ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రత్యేకంగా నిధులు కేటాయించేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ఉమ్మనేని కృష్ణ, సండ్ర వెంకట్రావు, కర్లకుంట శాంతయ్య, సూర్యదేవర సుధాకర్, తన్నీరు రవి, వడ్డెబోయిన నరేష్, తన్నీరు పుల్లారావు, తమ్మారపు బ్రహ్మయ్య, సండ్ర కిరణ్, అంచా భాస్కర్‌రావు, కాసాని హనుమంతరావు, సాదినేని వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles