సంస్కృతీ సంప్రదాయాలు పాటించాలి

Sat,August 10, 2019 04:07 AM

-భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్
భద్రాచలం, నమస్తే తెలంగాణ : ఇతిహాస, నాగరికత, సంస్కృతీ సంప్రదాయాలను పాటించడంలో నిలువటద్దం ఆదివాసీల గిరిజనులను ఆదర్శంగా తీసుకుంటే ప్రపంచ దేశ జనాభా సంస్కృతీ సంప్రదాయాలు పాటించి, ఆదివాసీ తెగ అంతరించిపోకుండా కాపాడుకున్నవారమవుతామని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అన్నారు. శుక్రవారం ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా భద్రాచలం పట్టణంలో ఆదివాసీ గిరిజనులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముందుగా మార్కెట్ సెంటర్‌లో ఉన్న కొమరంభీమ్ విగ్రహానికి పీవో పూలమాలలు వేసి నివాళ్లు అర్పించారు. అనంతరం గిరిజనుల ర్యాలీలో పాల్గొని అంబేద్కర్ సెంటర్‌లో ఉన్న అల్లూరిసీతారామరాజు, గంటందొర, మల్లుదొర విగ్రహాలకు పూలమాలలు వేసి, గిరిజనులతో కలిసి పీవో సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని నృత్యాలు చేశారు. అనంతరం గిరిజన అభ్యుదయ భవనంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పీవో మాట్లాడారు.

ఆదివాసీల హక్కుల కోసం ఎందరో ఆదివాసీల ప్రాణత్యాగాల ఫలితంగా 1982 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి నెదర్లాండ్‌లో ఆదివాసీలు స్వేచ్ఛా స్వాతంత్య్రంగా జీవించడానికి 140 దేశాల ప్రతినిధులు పాల్గొని ప్రపంచ ఆదివాసీ దినంగా ఆగస్టు9న తీర్మాణం చేశారని తెలిపారు. గిరిజన విద్యార్థినీ, విద్యార్థులు విద్యకొరకు ఆశ్రమ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు 2150 హ్యాబిటేషన్‌లలోని గిరిజన ఆదివాసీల పిల్లల కోసం హాస్టల్, రెసిడెన్షిఁల్ స్కూల్స్ ప్రారంభించామని పీవో తెలిపారు. గిరిజన విద్యార్థులు 10వ తరగతి వరకు చదివి ఖాళీగా ఉండకుండా స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కాలేజీ ఖమ్మం, తనికెల్లతో పాటు దమ్మపేట కాలేజీ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ద్వారా ఐఐటీ, త్రిబుల్ ఐటీ, నీట్, ఎంసెట్ పరీక్షలు రాయడానికి శిక్షణ ఇస్తున్నారని వివరించారు. కొత్తగా ఐటీడీఏ సమగ్ర సమాచారం తెలుసుకోవడానికి ఒక వెబ్‌సైట్ ప్రారంభించామని పీవో పేర్కొన్నారు. ఐటీడీఏ.బీసీఎం. కామ్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. గిరిజన యువకులకు ఆర్మీ రిక్రూట్‌మెంట్ శిక్షణ, మార్కెటింగ్, కంప్యూటర్ శిక్షన ఇచ్చి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తున్నామని తెలిపారు. అనంతరం పీవో గౌతమ్ రేల రేల పాటల సీడీనీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డీటీడీవో జహీరుద్దీన్, ఏపీవో జనరల్ నాగోరావు, ఏవో భీమ్, ఈఈ టీడబ్ల్యూ కోటిరెడ్డి, మేనేజర్ సురేందర్, డీఎం జీసీసీ కుంజా వాణి, తెల్లం వెంకట్రావు, కుంజా ధర్మ, పూనెం కృష్ణ, రమేష్, వీరభద్రం, జయబాబు, పుల్లయ్య, వివిధ ఆదివాసీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

137
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles