మాజీ మంత్రి తుమ్మలను కలిసిన

Sat,August 10, 2019 04:07 AM

-ఎంపీ నామా నాగేశ్వరరావు
ఖమ్మం నమస్తేతెలంగాణ/దమ్మపేట: ఖమ్మం పార్లమెంట్ సభ్యులు, టీఆర్‌ఎస్ లోక్ సభ పక్ష నేత నామా నాగేశ్వరరావు మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును శుక్రవారం దమ్మపేట మండలం, గండుగలపల్లిలోని ఆయన స్వగృహంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. సత్తుపల్లిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన క్షత్రగాత్రులను పరామర్శించి తిరిగి ఖమ్మం వస్తుండగా మార్గంమధ్యలో తుమ్మలను ఆయన గ్రామంలో కలిశారు. తుమ్మలను కలిసిన వారిలో నామాతో పాటు టీఆర్‌ఎస్ నాయకులు తుళ్లూరి బ్రహ్మయ్య, డాక్టర్ కుసంపుడి నర్సింహరావు, దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరావు, ఎంపీపీ సోయం ప్రసాద్, చిత్తారు సింహాద్రి, హరికృష్ణ తదితర నాయకులు ఉన్నారు.

157
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles