ఎంపీ నామాను కలిసిన జడ్పీ చైర్మన్

Sat,August 10, 2019 04:07 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ : జిల్లా పరిషత్ చైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేసిన లింగాల కమల్‌రాజ్ శుక్రవారం ఎంపీ నామా నాగేశ్వరరావును ఖమ్మంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి తాతా మధు, ఖమ్మం రూరల్ మండలం జడ్పీటీసీ ఎండవల్లి ప్రసాద్, టీఆర్‌ఎస్ నాయకులు బెల్లం వేణు, టీ వాసుదేవరావు, కనుమూరి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఎంపీ నామా నాగేశ్వరరావును ఎమ్మెల్యే లావుడ్యా రాములునాయక్, మేయర్ పాపాలాల్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆర్‌జేసీ కృష్ణ, కార్పొరేటర్ జంగం భాస్కర్ తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు.

150
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles