చేనేత హస్తకళా ప్రదర్శనను ప్రారంభించిన ఎంపీ నామా..

Sun,August 11, 2019 04:36 AM

ఖమ్మం కల్చరల్ ఆగస్టు10: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతోనే చేనేత హస్త కళలకు వైభవం వచ్చిందని ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. శనివారం నగరంలోని టీటీడీ కల్యాణ మండపంలో స్వదేశీ హ్యాండీ క్రాఫ్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చేనేత హస్త కళా ప్రదర్శనను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కేసీఆర్ చలువతో చేనేత, సంస్కృతిక రంగాలకు మంచి దశ వచ్చిందని, దీనిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వేర్వేరు ప్రాంతాల నుంచి వచ్చిన కళాకారులు సుమారు వంద స్టాల్స్‌లో అన్ని రకాల చేనేత వస్ర్తాలు, హస్త కళలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈసందర్భంగా ఆయన పలు చేనేత వస్ర్తాలు, హస్త కళలను పరిశీలించి కళాకారుల నైపుణ్యాన్ని అభినందించారు. ఎగ్జిబిషన్ నిర్వాహకుడు చిరంజీవి మాట్లాడుతూ.. ఈనెల 30 వరకు ఈ ప్రదర్శన కొనసాగుతుందని తెలిపారు. చేనేత వస్ర్తాల కొనుగోలుపై 20 శాతం, హస్త కళలపై 10 శాతం డిస్కౌంట్ ఇవ్వబడతాయని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ పాపాలాల్, కార్పొరేటర్ పాలెపు సీతమ్మ,రమణ, సింహాద్రి, బ్రహ్మయ్య, ఎగ్జిబిషన్ మేనేజర్ చిరంజీవి, రాంబాబు పాల్గొన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles