కేటీఆర్‌కు కృతజ్ఞతలు..

Sun,August 11, 2019 04:37 AM

టీ ముస్లిం నూర్‌భాష, దూదేకుల వృత్తి
సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దా సాహెబ్..
మయూరి సెంటర్, ఆగస్టు 10: రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం దూదేకులకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం స్థలం, నిధులు కేటాయిండం హర్షనీయమంటూ తెలంగాణ ముస్లిం నూర్‌భాష దూదేకుల వృత్తి సంక్షేమం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సిద్దా సాహెబ్ ఆధ్వర్యంలో శనివారం హైద్రాబాద్‌లో టీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ను కలిసి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా సిద్దా సాహెబ్ మాట్లాడుతూ భారతదేశంలోని అత్యంత వెనుకబడిన వారు ముస్లిం మైనార్టీలు అని, దూదేకుల సంక్షేమ సంఘంకు సీఎం కేసీఆర్ కుల వృత్తులను ప్రోత్సహించడంలో భాగంగా హైద్రాబాద్ నగరంలో సంఘం భవనం కోసం రెండు ఎకరాల స్థలం, రూ.2 కోట్ల నిధులు కేటాయించడం సంతోషదాయకమన్నారు. కేటీఆర్ చొరవతో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలతో పాటు బక్రీద్ పండుగ శుభాకాంక్షలను తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు అబిమోద్దీన్, రజాక్, ఇస్మాయిల్, మీరా, హషమ్, నాగూర్, సైదులు, సఫీయా తదితరులున్నారు.

121
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles