మాజీ మంత్రి తుమ్మలను కలిసిన జడ్పీచైర్మన్..

Sun,August 11, 2019 04:37 AM

దమ్మపేట, ఆగస్టు 10: మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరావును ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజు శనివారం మండలంలోని గండుగులపల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు. ఈ సందర్బంగా నూతనంగా ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్‌గా కమల్‌రాజుతోపాటు చింతకానీ, పెనుబల్లి జడ్పీటీసీలు పర్చగాని తిరుపతి కిషోర్, చెక్కిలాల మోహనరావులను తన నివాసానికి విచ్చేసిన వారిని తుమ్మల కరచాలనం ద్వారా సాదరంగా ఆహ్వానించారు.నూతనంగా ప్రజాప్రతి నిధులుగా బాధ్యతలు చేపట్టిన వారిని అభినందించి దుశ్వాలువాలతో సన్మానించారు అనంతరం తేనేటి విందులో పాల్గొన్నారు. రాజకీయంగా ప్రజాప్రతి నిధులుగా తాముచేసే ప్రజాసేవపై రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రవేశపెట్టే సంక్షేమ అభివృద్ది పధకాలను ఎలా సద్వినియోగం చేయాలని అనే అంశాలపై తమకు తమ సూచనలు సలహాలు సీనియర్ నేతగా అందజేయాలని కోరారు. మాజీ మంత్రి తుమ్మలను కలసిన వారిలో దమ్మపేట జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరావు, రైతు సన్వయ సమితి సభ్యులు దొడ్డాకుల రాజేశ్వరావు, బీసీ సంఘం నాయకులు మచ్చా శ్రీనివాసరావు, కాసాని నాగప్రసాద్, తదితరులు వున్నారు.

122
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles