బీజేపీ, టీడీపీ నాయకులపై కేసు నమోదు

Sun,August 11, 2019 04:38 AM

కూసుమంచి:జిల్లాలో 144 సెక్షన్ అమలులో ఉండగా, ఎలాంటి అనుమతిలేకుండా పాలేరు వద్ద ఖమ్మం -సూర్యాపేట రోడ్డుపై రాస్తారోకో చేస్తూ విధుల్లో ఉన్న కానిస్టేబుల్‌ను అడ్డుకున్న 18 మంది బీజేపీ, టీడీపీ నాయకులపై కూసుమంచి పోలీసులు కేసు నమోదు చేశారు. పాలేరు పాతకాలువకు నీరు విడుదల చేయాలని బీజేపీ, టీడీపీ నాయకులు అధిక సంఖ్యలో శనివారం రహదారిపైకి చేరుకుని రాస్తారోకో నిర్వహించారు. విధుల్లో కానిస్టేబుల్ శ్రీను అడ్డుకోబోగా అతన్ని లెక్కచేయలేదు.

దీంతో శ్రీను స్థానిక ఎస్సైకు ఫిర్యాదు చేశారు. ఆందోళనలో పాల్గొన్న బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కొండపల్లి శ్రీధర్‌రెడ్డి, బీజేవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గల్లా సత్యనారాయణ, బీజేపీ నేలకొండపల్లి మండల కమిటీ అధ్యక్షుడు నున్నా రవికుమార్, తిరుమలాయపాలెం మండల కమిటీ అధ్యక్షుడు గుండా శ్రీనివాసరెడ్డి, రాష్ట్ర నాయకుడు దేవకి వాసుదేవరావు, పాలేరు నియోజకవర్గ కన్వీనర్ బజ్జూరి మల్లారెడ్డి, మండల నాయకులు దాసరి వెంకటేశ్వర్లు, రాసాల రవి, మండల కార్యదర్శి భూక్యా శంకర్, జిల్లా ఉపాధ్యక్షులు తక్కెళ్లపల్లి నరేందర్, బీరెల్లి లక్ష్మయ్య, మండల నాయకులు దామళ్ల ప్రభాకర్, బీజేపీ కూసుమంచి మండల కమిటీ అధ్యక్షుడు బానోత్ రవి, కూసుమంచి మండల టీడీపీ కార్యదర్శి మందలపల్లి కోటేశ్వరరావు, మండల అధ్యక్షుడు జర్పుల శ్రీను, నేలకొండపల్లి మండల టీడీపీ అధ్యక్షుడు నల్లమోతు మల్లయ్య, కార్యదర్శి దుంపల జగన్, తెలుగుయువత నాయకుడు గోవింద్ యల్లయ్యలపై ఐపీసీ 341,188 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేసినట్లు ఎస్సై అశోక్‌రెడ్డి తెలిపారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles