వైద్యాధికారుల పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

Mon,August 12, 2019 12:14 AM

మయూరిసెంటర్ : నగరంలోని అర్బన్ హెల్త్ సెంటర్‌లో ఖాళీగా ఉన్న వైద్యాధికారుల పోస్టులు భర్తీ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ బీ కళావతిబాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్బన్ హెల్త్ సెంటర్లలో ఖాళీగా ఉన్న పోస్టులను నింపేందుకు పుల్ టైం వైద్యాధికారులు (3), పార్ట్‌టైం వైద్యాధికారులు (2) పోస్టులు ఉన్నాయన్నారు. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపధికన ఒక సంవత్సరకాలం పనిచేయాల్సి ఉంటుందని ఆమె తెలిపారు.

పుల్ టైం వైద్యాధికారులకు నెలకు రూ.33,000లు, పార్ట్ టైం వైద్యాధికారులకు రూ.19,800లు పారితోషికం ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ నియామకాలను ఈ నెల 16వ తేదీన వాక్ ఇన్ ఇంటర్యూ పద్ధతిలో జరుపున్నట్లు పేర్కొన్నారు. ఎంబీబీఎస్ పూర్తి చేసిన అభ్యర్థులు అర్హులని, అర్హులైన అభ్యర్థులు తమ బయోడేటా ఫారంతో పాటు అర్హత సర్టిఫికెట్, కుల ధ్రువీకరణ సర్టిఫికెట్స్ జతపర్చి ఈ నెల 14 వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయం ఖమ్మంలో సమర్పించాలన్నారు. ఈ నెల 16వ తేదీన వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసి నియామక పత్రాలు అందజేస్తామని తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న అభ్యర్థులందరు ఈ నెల 16వ తేదీన హాజరుకావాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే జిల్లా వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సంప్రదించాలన్నారు.

133
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles