బాలల హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత

Mon,August 12, 2019 12:15 AM

ఖమ్మం నమస్తేతెలంగాణ : బాలల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని టీఆర్‌ఎస్ లోక్‌సభా పక్షనేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు అన్నారు. బాలల హక్కులపై 7వ తరగతి విద్యార్థి దుగ్గిదేవర రఘునందన్ రూపొందించిన ప్రచార పోస్టర్‌ను ఆదివారం తన క్యాంపు కార్యాలయంలో ఎంపీ ఆవిష్కరించి మాట్లాడారు. బాల్యం పిల్లల జన్మహక్కు అని, 18 సంవత్సరాలలోపు వారంతా బాలలేనని పేర్కొన్నారు. నేటి బాలలే రేపటి పౌరులనే విషయాన్ని గుర్తించి నేడు బాలలను సంరక్షించడం భవిష్యత్ తరానికి ఎంతో అవసరమన్నారు. బాలలకు రాజ్యాంగం కల్పించిన హక్కుల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాలల హక్కులపై అవగాహన కల్పించేందుకు పన్నెండేళ్ల బాలుడు దుగ్గిదేవర శ్రీరఘునందన్ చేస్తున్నకృషి అభినందనీయమన్నారు.

ఎవరైనా బాలలకు హాని తలపెడుతున్నారని భావించినా ఆపదలో ఆదుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీనెంబరు 1098కు సమాచారం అందించి రక్షించాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ తుళ్లూరి బ్రహ్మయ్య, దాసరి వీరభద్రరావు, యూత్‌క్లబ్ అధ్యక్ష, సహాధ్యక్షుడు దుగ్గిదేవర అజయ్‌కుమార్, రాయల శ్రీనివాసరావు, రేగళ్ల కృష్ణప్రసాద్, చిన్నారులు దుగ్గిదేవర శ్రీరఘునందన్, రాయల సాయి రాఘవ మీనా, జ్ఞాన్ రతన్ మన్విత్ పాల్గొన్నారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles