ఎన్‌ఎంసీ బిల్లు ప్రజా వ్యతిరేకం

Mon,August 12, 2019 12:15 AM

మయూరిసెంటర్ : కేంద్ర ప్రభుత్వం ఎన్‌ఎంసీ బిల్లును ప్రవేశపెట్టడం ప్రజా వ్యతిరేకమని నిమ్స్ మాజీ డైరెక్టర్ రాజారెడ్డి ఆరోపించారు. ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాల్‌లో జాతీయ వైద్యకమిషన్ బిల్లు- పర్యవసనాలు అంశంపై జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సెమినార్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. జాతీయ వైద్య కమిషన్ బిల్లువల్ల అనర్హుల చేతుల్లోకి వైద్యం వెళ్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైద్య రంగంలో వసతులు, సీట్లు పెంచడం వల్ల మరికొందరు వైద్యులను ఉత్పత్తి చేసే చర్యలు తీసుకోకుండా ఈ బిల్లు ద్వారా ఎంబీబీఎస్ చదవని అనర్హులైన చాలా మంది వ్యక్తులను వైద్యసేవలు అందించడానికి చట్టబద్ధం చేశారని విమర్శించారు. ఈ బిల్లు ద్వారా వైద్య కళాశాలల్లో 50 శాతం కంటే ఎక్కువ సీట్లను ప్రభుత్వం ఫీజ్ నియంత్రణ లేకపోవడంతో ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఇష్టానుసారంగా ఫీజులు పెంచడం వల్ల వైద్య విద్య అనేది మధ్య, దిగువ తరగతి వాళ్లకు కలగానే మిగిలిపోతుందన్నారు.

ఈ బిల్లు ద్వారా వైద్య అధికార బృందంలో ఎక్కువ మంది వైద్యులు వాళ్లే ఉంటారనీ, దీని వల్ల మొత్తం వైద్యారోగ్య వ్యవస్థకే ముప్పు వాటిల్లుతుందన్నారు. ఈ బిల్లు వల్ల డాక్టర్ల ప్రజాస్వామ్యయుత పాత్రను రద్దు చేయడం, నిరంకుశంగా రుద్దడమేనన్నారు. అందుకే గతంలో వలే అన్ని రాష్ర్టాలు, కాలేజీల నుంచి ఎన్నికైన వారికి ప్రాధాన్యత కల్పించాలన్నారు. తగిన తర్ఫీదులేని డాక్టర్లను గ్రామాలకు ఇవ్వడమంటే జనం ప్రాణాలకు విలువ ఇవ్వకపోవడమే అన్నారు. ఈ బిల్లును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఐఎంఏ అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ శ్రీకళ, డాక్టర్ రెహనా బేగం, జేవీవీ నేతలు, శివనారాయణ, రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ఈ సదస్సులో ప్రముఖ వైద్యులు యలమంచిలి రవీంద్రనాథ్, శ్రీనివాసరావు, కేవీ కృష్ణరావు, రామారావు, డాక్టర్ రమాదేవి, భారవి, రవిమారుతి, జేవీవీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అలవాల నాగేశ్వరరావు, కార్యదర్శి రాములమ్మ, మల్లేంపాటి వీరభద్రరావు, తాతా రాఘవయ్య, నామా పురుషోత్తం, రామకృష్ణ, సుబ్బారావు, డాన్ బాస్కో పాల్గొన్నారు.

115
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles