జమలాపురం ఆలయంలో ప్రత్యేక పూజలు

Mon,August 12, 2019 12:16 AM

ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన జమాలపురం శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం 6 గంటలకు ప్రాతఃకాల అర్చనలు, అనుష్టానం, సర్వదేవత ఆరాధన, ప్రత్యేక పూజలు చేశారు. అష్టోత్తర కళశాభిషేకం నిర్వహించి స్వామికి పవిత్రధారణ, అనంతరం నివేదిన, సాయంకాల పూజలు నిర్వహించారు. భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త యు విజయదేవశర్మ, ఆలయ ప్రధాన అర్చకుడు యు శ్రీనివాస్, ఆలయ పర్యవేక్షకుడు బీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

137
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles