పేదలకు విద్యను దూరం చేయడానికే..

Mon,August 12, 2019 11:40 PM

-ఎస్‌టీఎఫ్‌ఐ 20వ ఆవిర్భావ సభలో జాతీయ కౌన్సిల్ సభ్యురాలు దుర్గాభవాని
ఖమ్మం ఎడ్యుకేషన్ : డాక్టర్ కస్తూరి రంగన్ నేతృత్వంలో రూపొందించిన జాతీయ విద్యా విధానం(ఎన్‌ఈపీ-2019) విద్యలో ప్రైవేటీ కరణను, కేంద్రీకరణను పెంచేదిగా ఉందని స్కూటీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్‌టీఎఫ్‌ఐ) జాతీయ కౌన్సిల్ సభ్యులు చావ దుర్గాభవాని అన్నారు. సోమవారం నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఎస్‌టీఎఫ్‌ఐ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. తొలుత పతాకావిష్కరణ చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించాలని చెబుతూనే ప్రైవేట్ పాఠశాలలకు సమాన అవకాశాలు ఇవ్వాలని చెప్పడం ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించి, పేదలకు విద్యను దూరం చేయడానకేనన్నారు. ఉమ్మడి జాబితాలో ఉన్న విద్యారంగంలో విధాన నిర్ణయాలు తీసుకునే సంతర్భంలో రాష్ర్టాల ప్రమేయం లేకుండా చేయడం ఫెడరల్ స్ఫూర్తిని దెబ్బతీసి, విద్యలో కేంద్రీకరణను పెంచే చర్యలో భాగమన్నారు. ఈ కార్యక్రమంలో నాగమల్లేశ్వరరావు, నెల్లూరి వీరబాబు, వెంకన్న, మంగీలాల్, శ్రీకాంత్, బిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles