బాలలతో బిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు..

Mon,August 12, 2019 11:40 PM

-సీడబ్ల్యూసీ చైర్మన్ ఎంల్ ప్రసాద్
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 12: బడికి వెళ్లి విద్యాబుద్దులు నేర్వాల్సిన పిల్లల చేత బిక్షాటన చేయిస్తే కఠిన చర్యలు తప్పవని చైల్డ్ వెల్ఫేర్ కమిటీ (సీడబ్ల్యూసీ) చైర్మన్ ఎంఎల్ ప్రసాద్ అన్నారు. ఆదివారం ఖమ్మం నగరంలో చైల్డ్‌లైన్-1098 జిల్లా సమన్వయకర్త శ్రీనివాస్ టీం సభ్యులతో కలిసి స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. వైరా రోడ్, కాల్వొడ్డు, మయూరి సెంటర్‌లలో చైల్డ్‌లైన్ సేవలపై అవగాహన కల్పించారు. ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెం గ్రామానికి చెందిన కొందరు తల్లులు పిల్లలచేత బిక్షాటన చేయిస్తుంగా రెస్క్యూ చేశారు. అనంతరం సదరు పిల్లలను, తల్లులను జిల్లా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా చైర్మన్ ప్రసాద్ పిల్లలకు, తల్లులకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చిన్నారుల చేత బిక్షాటన చేయిస్తే జేజేఏ యాక్టు ప్రకారం శిక్షార్హమైన నేరమన్నారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం ఆయితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో 1098 టీం సభ్యులు అనూష, భారతి, హరిప్రసాద్, మధుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

121
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles