వేధింపులు తాళలేక వ్యక్తి ఆత్మహత్య

Mon,August 12, 2019 11:40 PM

తిరుమలాయపాలెం, ఆగస్టు 12: కుటుంబ సభ్యుల వేధింపులకు తాళలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన మండలంలోని సుబ్లేడులో సోమవారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గంధసిరి మైసయ్య (45)కు వాటగా వచ్చిన 1.20 ఎకరాల భూమిని పట్టా చేయకుండా తల్లిదండ్రులు గంధసిరి వెంకటమల్లు, గోపమ్మ, వారి ఇద్దరు కూతుళ్లు, అల్లుళ్లు, మరో ఇద్దరు వ్యక్తులు వేదింపులకు పాల్పడుతున్నారు. అప్పులు చెల్లిస్తేనే భూమి పట్టా చేస్తామని అతన్ని మానసికంగా వేదించారు. దీంతో మనస్థాపం చెందిన మైసయ్య(45) ఈనెల 5వతేదీన పురుగుల మందు తాగాడు. ప్రాణాపాయస్థితిలో ఉన్న అతన్ని ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్సపొందుతూ మృతి చెందాడు. భార్య విజయ ఫిర్యాదు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles