నేడు దివ్యాంగులకు సదరం క్యాంప్..

Mon,August 12, 2019 11:41 PM

ఖమ్మం వ్యవసాయం, ఆగష్టు 12: కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ ఆదేశాల మేరకు నేడు దివ్యాంగులకు సదరం క్యాంపు నిర్వహిస్తున్నట్లు డీఆర్‌డీవో, డీఆర్‌డీఏ అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కేంద్రంలోని డీసీహెచ్‌ఎస్ విభాగం ప్రభుత్వ వైద్యశాల నందు ఈ క్యాంపు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్ధారణ పరీక్షలు జరుగుతాయన్నారు. అన్ని మండలాల పరిధిలోని వినికిడి, మానసిక వికలాంగత్వం మానసిక రుగ్మతలోపం ఉన్న వారు హాజరుకావాలని వారు సూచించారు. గతంలో సదరం క్యాంపుకు హాజరుకాని వారు మాత్రమే రావాలని వారు పేర్కొన్నారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles