పంద్రాగస్టున 100 అడుగుల త్రివర్ణ పతాకం ఆవిష్కరణ

Mon,August 12, 2019 11:41 PM

-హాజరు కానున్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు 12: ఈనెల 15 స్వాతంత్ర దినోత్సవం రోజున నగరంలో ఓ గొప్ప దృశ్యం ఆవిష్కరణ కానుంది. నగరంలోని లకారాం ట్యాంక్‌బండ్‌పై 100 అడుగుల త్రివర్ణ పతాకం ఎగురనుంది. వరల్డ్ లార్జెస్ట్ ఇండియన్ నేషనల్ ఫ్లాగ్ మ్యానిఫక్చర్, ప్లాగ్ పోల్ సైప్లె వారి సౌజన్యంతో ఈ కార్యక్రమం జరగనుంది. అతి పెద్ద జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా రాష్ట్ర మత్స్య, పశుసంవర్థకశాఖ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హాజరుకానున్నారు. అదే విధంగా అతిథులుగా ఖమ్మం ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ఇతర ప్రజాప్రతినిధులు, ముఖ్య అధికారులు హాజరుకానున్నారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles