తనికెళ్ల భరణికి సత్కారం...

Mon,August 12, 2019 11:41 PM

ఖమ్మం కల్చరల్ ఆగస్టు12 : ఖమ్మానికి చెందిన శ్రీఅన్నపూర్ణ క్రియేషన్స్ బ్యానర్ నిర్మాత, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ, ఇతర సభ్యులు ఆదివారం రాత్రి సినీ రచయిత, నటుడు, దర్శకుడు తనికెళ్ల భరణిని ఘనంగా సత్కరించారు. నగరంలోని చిత్ర యూనిట్ కార్యాలయాన్ని సందర్శించిన తనికెళ్ల భరణిని వారు శాలువా, మెమెంటోతో సత్కరించారు. ఈసందర్భంగా తనికెళ్ల మాట్లాడుతూ సాయికృష్ణతో కలిసి ఎందరో మహానుభావులు చిత్రాన్ని చేశానని, మరిన్ని చిత్రాలు తీయాలనే తపన, కోరిక అతనిలో ఉందన్నారు. దర్శకుడు సాయికృష్ణ మాట్లాడుతూ తనికెళ్ల భరణి దగ్గర తాను అనేక విషయాలు తెలుసుకున్నానని, తన మూడవ చిత్రంలో కూడా ఆయన నటిస్తారని తెలిపారు. కార్యక్రమంలో తల్లాడ శ్రీలక్ష్మి, శ్యామ్‌గుప్తా, కెఎస్‌ఆర్, మాధవి, సంస్థ మేనేజర్ రాజు, కట్స్ అండ్ కర్ల్స్ రమేష్, సాయి గౌతమ్ గుప్తా,నాగరాజు, శివరాథోడ్ తదితరులు పాల్గొన్నారు.

108
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles