నైపుణ్యాలతోనే ఉద్యోగ అవకాశాలు..

Mon,August 12, 2019 11:42 PM

ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు12: విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలు పెంపొందించుకుంటేనే ఉద్యోగ అవకాశాలు అందిపుచ్చుకోగలరని ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్ ఉమాశంకర్ అన్నారు. సోమవారం నగరంలోని కవిత మెమోరియల్ డిగ్రీ కళాశాలలో ఎన్‌ఎస్‌ఎస్ శిక్షణ కార్యక్రమం నాలుగో రోజు కొనసాగింది. ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్, పర్యావరణ పరిరక్షణ చర్యలతో పాటు యోగా శిక్షణపై అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో ఇంగ్లిష్ ట్రైనర్ రామ్మోహన్, ప్రిన్సిపాల్ డాక్టర్ రమణారావు, జగదీష్, డాక్టర్ ఆంజనేయులు, గురవయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.

144
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles