రామకోటి పుస్తక నిమజ్జనం

Mon,August 12, 2019 11:42 PM

భద్రాచలం, నమస్తే తెలంగాణ: భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి దేవస్థానం సన్నిధిలో భక్తులు రాసిన రామకోటి పుస్తకాలను సోమవారం సాయంత్రం రామాలయ అధికారులు ఘనంగా నిమజ్జనం గావించారు. రెండు వాహనాల్లో భక్తులు పంపిన రామకోటి పుస్తకాలను ఉంచి తొలుత పుణ్యఃవచనం తీర్థం చల్లారు. ఊరేగింపుగా బ్రిడ్జి సెంటర్‌కు చేరుకున్నారు. దేవస్థాన ఈవో రమేష్‌బాబు శిరస్సుపై రామకోటి పుస్తకాలను ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. లక్ష్మీ అష్టోత్తర శత నామార్చన పూజలు గావించారు. అనంతరం ఈవో తాళ్లూరి రమేష్‌బాబు గోదావరి నదిలో పట్టువస్ర్తాలు, పసుపు, కుంకుమ, గాజులు విడిచిపెట్టారు. వీటితో పాటు రామకోటి పుస్తకాలను నిమజ్జనం చేశారు.

149
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles