సదరం శిబిరానికి 320 మంది దివ్యాంగుల హాజరు

Wed,August 14, 2019 01:00 AM

మయూరి సెంటర్ : జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో నిర్వహించిన సదరం శిబిరానికి 320 మంది దివ్యాంగులు తమ వికలాంగ శాత ధ్రువీకరణ పరీక్షల కోసం హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ.. ప్రభుత్వ సూచనల మేరకు దివ్యాంగులకు ఆయా కేటగిరిలకు చెందిన దివ్యాంగులకు వారాల వారీగా సదరం శిబిరానికి హాజరుకావాలని ముందస్తుగానే సూచించి ఇబ్బందులు తలెత్తకుండా తమ విభాగంతో పాటు, డీఆర్‌డీఏ ఉద్యోగులు, సిబ్బంది తగిన చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. మానసిక వికలాంగులు, చెవి, మూగ, కంటి చూపు తక్కువగా ఉన్న దివ్యాంగులకు సదరం శిబిరంలో పరీక్షించడం జరిగిందన్నారు. మానసిక దివ్యాంగులు, ఎంఐకు చెందిన 148 మంది, చెవి, మూగ కంటి సంబంధిత సమస్య కలిగిన 172 మంది దివ్యాంగులను వికలాంగ శాత పరీక్షలను నిర్వహించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు ఎం నాగేశ్వరరావు, పవన్, రాజేష్, డీఆర్‌డీఏ విభాగ డీపీఎం, పద్మ, ఏపీఎం లక్ష్మణ్‌రావు, సిబ్బంది వినయ్, నాగుల్‌మీరా, రమాదేవి,వెంకన్న, చంద్రశేఖర్, కృష్ణమూర్తి తదితరులున్నారు.

127
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles