లకారం ట్యాంక్‌బండ్‌పై మరో చారిత్రాత్మకం..

Wed,August 14, 2019 01:00 AM

-ఎమ్మెల్యే అజయ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు
ఖమ్మం, నమస్తే తెలంగాణ : లకారం ట్యాంక్ బండ్‌పై మరో చారిత్రాత్మకం నిర్మాణం చోటు చేసుకోనుంది. ఆగస్టు 15 భారత స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరంలోని లకారం ట్యాంక్‌బండ్‌పై వందడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ఈ ఆవిష్కరణ కార్యక్రమానికి ఖమ్మం పరేడ్ గ్రౌండ్‌లో స్వతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరుకానున్న రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ట్యాంక్ బండ్‌పై ఈ జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొననున్నారు. దేశంలోనే మొదటి సారిగా ఓ జిల్లా కేంద్రంలో వందడుగుల జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరగడం ఎంతో అభినందనీయమని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఖమ్మం ప్రజలకు లకారంలో ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించడంతో పాటు దేశభక్తిని పెపొందించే విధంగా లకారం ట్యాంక్‌బండ్‌పై వందడగుల జాతీయ జెండా ఏర్పాటు చేసి మరో చారిత్రాత్మక ఘట్టాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా ట్యాంక్‌బండ్‌పై జరుగుతున్న జెండా ఆవిష్కరణ పనులను ఖమ్మం నగర మేయర్ పాపాలాల్ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. లకారం ట్యాంక్ బండ్‌పై రూ.12.50 లక్షల వ్యయంతో నిర్మాణం జరుగుతున్నట్లుగా తెలిపారు. జెండా వెడల్పు 30 అడుగులు, ఎత్తు 20 అడుగులుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో నగరపాలక కమిషనర్ జే శ్రీనివాసరావు, ఇరిగేషన్ ఏఈడీఐలు, నగరపాలక ఏఈ, డీఈలు, కార్పొరేటర్లు నీరజ, భాస్కర్ తదితరులున్నారు.

142
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles