పాలేరుకు చేరిన సాగర్ జలాలు..

Wed,August 14, 2019 01:01 AM

కూసుమంచి, ఆగస్టు 13: నాగార్జునసాగర్ నుంచి ఎడమకాలువకు వదిలిన నీరు మంగళవారం పాలేరు రిజర్వాయర్‌లో ప్రవేశించాయి. ఆదివారం మధ్యాహ్నం విడుదల చేసిన నీరు నల్గొండ, సూర్యాపేట జిల్లాల మీదుగా పాలేరుకు చేరింది. మంగళవారం తెల్లవారుజామున స్వల్పంగా నీరు చేరి, క్రమేపీ పెరుగుతోంది. సూర్యాపేట జిల్లా పొనుగోడు వద్ద నీటిని చెరువులకు మళ్లించడంతో పాటు, యూటీ (అండర్ టన్నెళ్లు)ల నుంచి లీకేజి వల్ల నీరు చాలావరకు వృథాగా పోయిందని ఎన్నెస్పీ అధికారులు తెలిపారు. అలాగే సోమవారం రాత్రి సూర్యాపేట జిల్లా మునగాల వద్ద ముక్త్యాల బ్రాంచి కెనాల్‌కు అధికంగా నీటిని మల్లించారు. ఈకారణాలతో పాలేరుకు మొదట స్వల్పంగా నీరు చేరుకుంది. మధ్యాహ్నం 3గంటల వరకు సుమారు 500 క్యూసెక్కుల వరకు చేరగా, రాత్రి 8 వరకు అది 1500 క్యూసెక్కులకు పెరిగిందని ఎన్నెస్పీ ఏఈ నరేందర్ తెలిపారు. బుధవారం ఉదయం నాటికి ఇది మూడువేల క్యూసెక్కుల వరకు పెరుగుతుందని అంచనా వేస్తున్నామన్నారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు సాగర్‌లో 574.60 అడుగుల నీటిమట్టం నమోదైందని, ఎడమ కాలువకు 8,455 క్యూసెక్కుల నీరు విడుదల చేస్తున్నారని అన్నారు. ప్రస్తుతం పాలేరు రిజర్వాయర్‌లో 13.3 అడుగుల నీటిమట్టం ఉంది.

171
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles