త్వరలో జిల్లా వైద్యశాలకు హ్యూమన్ మిల్క్ బ్యాంక్..

Wed,August 14, 2019 01:01 AM

-జిల్లా వైద్యశాలను సందర్శించిన ప్రత్యేక బృందం
మయూరిసెంటర్, ఆగస్టు 13: జిల్లా కేంద్ర ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో బ్లడ్‌బ్యాంక్ తరహాలో హ్యూమన్ మిల్క్ బ్యాంక్ ఏర్పాటు కోసం స్థల పరిశీలన, ప్రతిపాదనల కోసం మంగళవారం ప్రత్యేక బృందం జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ వైద్యశాలకు చేరింది. గర్భిణులకు మెరుగైన వైద్యసేవలు అందుతున్న నేపథ్యంలో అప్పుడే జన్మించిన చిన్నారులకు, ఇతర సమస్యలు ఉన్న చిన్నారులను నవజాత శిశు సంరక్షణ కేంద్రంలో సేవలు అందించబడుతున్నాయి. అయితే సీజేరియన్, సాధారణ ప్రసవాలలో జన్మించిన శిశువులలో ఆరోగ్య సమస్యలున్న చిన్నారులను ఎస్‌ఎన్‌సీయూలో ఆరోగ్యసేవలు అందుతాయి. ఈ నేపథ్యంలో అప్పుడే జన్మించిన శిశువుకు తల్లిపాలను పట్టి ఆ పాలను మాతా శిశు సంరక్షణ కేంద్రంలోని ఫ్రిజ్‌లో -20 డిగ్రీస్‌లో భద్రపరిచి అనంతరం శిశువు ఆరోగ్యవంతంగా కాగానే ఆ శిశువుకు ట్యూబ్, స్పూన్ ద్వారా ఆ తల్లిపాలను అందించడం జరుగుతుంది. ఈ విధంగా తల్లి పాలను శిశువులకు అందిస్తున్న నేపథ్యంలో ఆ పాలను స్టోరేజ్ చేసి శిశువుకు కొన్ని నిమిషాలు గడిచాక తల్లిపాలను అందిస్తున్నారు జిల్లా వైద్యబృందం. ప్రతిరోజు 34 మంది గర్భిణులు బిడ్డలకు జన్మనిస్తున్న నేపథ్యంలో తల్లిపాల శీతలీకరణ కేంద్రం కోసం ప్రత్యేక బృందం రాష్ట్ర ప్రోగ్రామ్ మేనేర్ సాయికిరణ్, ఎక్యూప్‌మెంట్ అడ్వైజర్ (చెన్నై) ఎం వెంకటరామన్‌లు ఆసుపత్రిని పరిశీలించారు. ఎస్‌ఎన్‌సీయూలో శిశువులకు అందుతున్న వైద్యసేవలను, మౌలిక సదుపాయాలను పర్యవేక్షించి, సూపరింటెండెంట్ డాక్టర్ బీ వెంకటేశ్వర్లును వివరాలు అడిగి తెలుసుకున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తల్లిపాల శీతలీకరణ కేంద్రాన్ని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో ఏర్పాటుకు సుముఖంగా ఉన్న నేపథ్యంలో ఈ బృందం జిల్లా వైద్యశాలకు సందర్శన నిమిత్తం వచ్చింది. త్వరలో నవజాత శిశువులకు తల్లిపాలను అందించే హ్యూమన్ మిల్క్ బ్యాంక్ (తల్లిపాల శీతలీకరణ కేంద్రం సేవలు) అందుబాటులోకి రానున్నాయి. ఈ కార్యక్రమంలో హెడ్‌నర్స్ సూర్యపోగు మేరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles