పంద్రాగస్టుకు ఏర్పాట్లు..

Wed,August 14, 2019 01:01 AM

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ : డెభ్బై మూడవ స్వాతంత్య్ర దినోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లను శరవేగంగా చేస్తోంది. గురువారం ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకలకు జిల్లాకేంద్రంలోని ప్ర గతి మైదాన్, సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టే వేడుకలకు ప్రకాశం స్టేడి యం అందంగా ముస్తాబవుతున్నాయి. కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రగతిమైదాన్‌లో స్వాతంత్య్ర వేడుకలకు ముఖ్య అతిథిగా రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ పాల్గొననున్న నేపథ్యంలో అన్నిశాఖల అధికారులు సమన్వయం తో పనిచేస్తున్నారు. వేడుకలను విజయవంతం చేయాలని కలెక్టర్ ఇప్పటికే అధికారులను ఆదేశించారు. ఈ నెల 15వ తేదీన స్వాతం త్య్ర వేడుకల్లో హోంశాఖ మంత్రి మహమూద్ అలీ ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రగతిమైదాన్‌లో ప్రణాళికాబద్ధంగా స్టేజీ, స్టాల్స్, అతిథులు, ప్రజలు కూర్చొని తిలకించేందుకు కుర్చీలు, షామియానాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు కూర్చునే ప్రదేశాన్ని తెలియజేస్తూ సైన్‌బోర్డులు ఏర్పాటు చేసి పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు న్విహించనున్నారు పూర్తి ఏజెన్సీ, మావోయిస్టుల ప్రభావం ఉన్న జిల్లా కావడంతో ఎస్పీ సునీల్‌దత్ ఆధ్వర్యం లో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు. కాగా హోం మంత్రి మహమూద్ అలీ బుధవారం రాత్రే జిల్లా కేంద్రానికి చేరుకొని గురువారం స్వాంతత్య్ర వేడుకల్లో పాల్గొని, అనంతరం ప్రజలను ఉద్దేశించి జిల్లా ప్రగతి నివేదికను చదివి వినిపించనున్నారు.

150
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles