రామున్ని దర్శించుకున్న జడ్పీ చైర్మన్ కమల్‌రాజు

Wed,August 14, 2019 01:02 AM

భద్రాచలం, నమస్తే తెలంగాణ:భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వా మివారిని ఖమ్మం జడ్‌పీ చైర్మన్ ఎల్.కమల్‌రాజ్, అశ్వారా వుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావులు మంగళవారం విడివిడిగా దర్శించు కున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు వారికి సంప్రదాయబద్దంగా ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జడ్‌పీ చైర్మన్, ఎమ్మెల్యే గర్భగుడిలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో ఉన్న శ్రీలక్ష్మీతాయారు అమ్మవారిని, అభయాంజనేయస్వామివారిని దర్శించుకొని తీర్థ్ధప్రసాదాలు స్వీకరించారు. రుష్యమూక మ్యూజియాన్ని సందర్శించి సీతమ్మవారి నగలను తిలకించారు. అనంతరం ఆలయ అర్చకులు వారికి ఆలయ విశిష్టత గురించి వివరించారు. దేవస్థానం అధికారులు వారిని శాలువాతో ఘనంగా సత్కరించి, జ్ఞాపిక అందజేశా రు. ఈ కార్యక్రమంలో దేవస్థానం అర్చకులు, సిబ్బంది, భద్రాచలం జడ్‌పీటీసీ రవికుమార్, కుంచాల రాజారాం, ఎస్‌కే అజీమ్, కొడాలి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.

151
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles