హరితహారంలో అందరూ భాగస్వాములవ్వాలి

Thu,August 15, 2019 12:20 AM

కల్లూరు: హరించుకుపోతున్న అడవుల వలన భూమిపై ఉష్ణోగ్రతల్లో పెనుమార్పులు జరుగటం వలన అధిక వేడి ఉత్పన్నమవుతుందని కల్లూరు ఏసీపీ ఎన్ వెంకటేశ్ అన్నారు. పట్టణంలోని లిటిల్ ప్లవర్స్, స్కూల్ , చర్చి ఆవరణలో చర్చి ఫాదర్లు, ఎంపీడీవో కరస్పాండెంట్ సతీశ్, ఇమ్మానియోల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమానికి కల్లూరు ఏసీపీ ఎన్ వెంకటేశ్, ఎంపీడీవో వి.నర్మదా సీఐ రవికుమార్‌లు ముఖ్య అతిథులుగా పాల్గొని బుధవారం 500 మొక్కలను నాటారు. అంతకుముందు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని స్కూల్ ప్రిన్స్‌పాల్ జీనా చేశారు.

అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఏసీపీ మాట్లాడుతూ అడవులు మనవాళికి ఎంతో ఉపయోగపడుతున్నాయని వాటిని హరించకుండా కాపాడాల్సిన బాధ్యత మనపై ఉందని, ప్రతిఒక్కరూ కనీసం 6 మొక్కలు నాటి సంరక్షించే బాధ్యత తీసుకుంటే తెలంగాణ రాష్ట్రం హరితవనంగా మారుతుందన్నారు. మొక్కలు విరివిగా ఉండటం వలన వర్షాలు సకాలంలో పడుతాయని, వర్షాల వల్లన రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్నారు. పరిసర ప్రాంతాల నుంచి పాఠశాలకు వచ్చే విద్యార్థులు మంచిగా చదువుకుని ఉన్నతస్థాయికి చేరుకొని తల్లిదండ్రులకు, సమాజానికి పేరు తేవాలన్నారు. కార్యక్రమంలో అటవీశాఖ డిప్యూటీ రేంజర్ నాగమణి, ఎస్‌ఐ మెడా ప్రసాద్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

158
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles