జెండా వందనం

Thu,August 15, 2019 12:25 AM

-100 అడుగుల ఎత్తులో మువ్వెన్నెల జెండా ఏర్పాటు
-నేడు ఆవిష్కరించనున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
-ఏర్పాట్లును పరిశీలించిన కలెక్టర్ ఆర్.వి.కర్ణన్

ఖమ్మం నమస్తేతెలంగాణ: ఖమ్మం నగరానికి మణిహారంగా ఉన్న లకారం ట్యాంక్‌బండ్‌పై గురువారం మరో అద్భుతం ఆవిష్కరణ జరుగుతున్నది. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఖమ్మం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో లకారం ట్యాంక్‌బండ్‌పై 100 అడుగుల ఎత్తున ఏర్పాటు చేసిన జాతీయ జెండాను రాష్ట్ర పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ, మత్స్యశాఖ, పాడి పరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆవిష్కరిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్ప డక Dందు వరకు కూడా ఖమ్మం నగరంలో ఒక ఆహ్లాదకరమైన స్థలం లేని పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితుల్లో తెలంగాణ ప్రభుత్వం మిషన్ కాకతీయ పథకం ద్వారా చెరువుల అభివృద్ధి పనులను చేపట్టడం జరిగింది. ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్ ప్రత్యేకచొరవతో అప్పటివరకు మురికి కూపంగా ఉండి, దుర్గంధం వెదజల్లుతున్న లకారం చెరువు రూ.19కోట్లతో ఆధునీకరణ పనులు చేపట్టారు. అంతేకాకుండా లకారం చెరువును నాగార్జునసాగర్ ఎడమకాలువ ద్వారా కృష్ణా జలాలను మళ్లించి లకారంను ప్రతి యేటా నింపుతున్నారు.

ఇది ప్రస్తుతం ఖమ్మం నగర ప్రజలకు ఒక ఐకాన్‌గా మారింది. నగరప్రజలతో పాటు వివిధ పనుల నిమిత్తం ఖమ్మంకు వచ్చే ప్రజలకు లకారం ట్యాంక్ బండ్ అందాలు ఆనందాన్ని ఇవ్వడంతో పాటు ఆహ్లాదాన్ని పంచుతున్నది. పండుగ రోజుల్లో, వారాంతపు సెలవు రోజుల్లో నగర ప్రజలు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఎంజాయ్ చేస్తున్నారు. లకారం చెరువులో నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో బోటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పిల్లలు, పెద్దలు ప్రతిరోజు బోటింగ్ చేస్తూ ఆనందంగా గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం సమయాల్లో ప్రజలు లకారంకు పెద్దసంఖ్యలో వచ్చి ఆనందంగా గడుపుతున్నారు. చిన్నారులకు సైక్లింగ్, బ్యాటరీ కార్లు కూడా అందుబాటులో ఉంచడంతో నగరప్రజలు వాటిని సద్వినియోగం చేసుకుంటూ ఆనందంగా గడుపుతున్నారు. ఇప్పటికే ఖమ్మం నగరానికి ఐకాన్‌గా ఉన్న లకారం గురువారం మరో నూతన గుర్తింపు నోచుకుంటున్నది. 100 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఏర్పాటు చేయడం విశేషం.

177
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles