సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్యే సండ్ర

Fri,August 16, 2019 12:16 AM

-పుట్టిన రోజు సందర్భంగా సీఎం ఆశీస్సులు పొందిన సండ్ర
ఖమ్మం నమస్తేతెలంగాణ:సత్తుపల్లి శాసనసభ్యుడు సం డ్ర వెంకటవీరయ్య తన పుట్టిన రోజు సందర్భంగా గురువారం రాత్రి ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావును హైద్రాబాద్‌లోని ప్రగతిభవన్‌లో కలిసి ఆశీస్సులు తీసుకున్నారు.తన ఇద్దరు కుమారులు భార్గవ్, తేజలను సండ్ర సీఎంకు పరిచయం చేశారు. ముఖ్యమంత్రిని శాలువాతో సత్కరించి తిరుపతి వెంకటేశ్వరస్వామి ప్రసాదాలను అందచేశారు.ప్రజా సేవలో మరింత కాలం వర్ధిల్లాలని సీఎం దీవించారు.నియోజకవర్గ సమస్యలను, ఖమ్మం జిల్లా రాజకీయ పరిస్థితులపై ముఖ్యమంత్రి సండ్రతో ముచ్చటించారు

157
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles