ఆకట్టుకున్న ఆవిష్కరణల ప్రదర్శన

Fri,August 16, 2019 12:16 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ పరేడ్ మైదానంలో వివిధ శాఖలకు సంబంధించి అందిస్తున్న సౌకర్యాలపై ప్రదర్శనల శాలలను ఏర్పాటు చేశారు. ఇంటింటా ఇన్నోవేటర్ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పరిధిలో ఆవిష్కర్తల ఆలోచనలను, ఆవిష్కరణలు అన్ని విధాలుగా విస్తృతం చేయడానికి ఒక నివేదికను ఏర్పాటు చేసింది. రాష్ట్ర అభివృద్ధి సూచికలో ఆవిష్కరణలు ముఖ్యపాత్రను పోషిస్తాయి. ఇంటింటా ఇన్నోవేటర్ ఎగ్జిబిషన్ కార్యక్రమంలో 10 మంది ఆవిష్కర్తలను ఎంపిక చేసి వారు ఆవిష్కరించిన ఆవిష్కరణలను ప్రదర్శించారు.

తెలంగాణ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సహకార సమాఖ్య లిమిటెడ్ పశుసంవర్థక శాఖ, మత్స్యశాఖ, వ్యవసాయశాఖ, ఉద్యానవనం, పట్టు పరిశ్రమశాఖ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, అటవీశాఖ, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా లీడ్‌బ్యాంక్, సమగ్ర శిక్షా అభియాన్-విద్యాశాఖ, ఆర్ట్, క్రాప్ట్, జిల్లా వైద్యారోగ్య కుటుంబ సంక్షేమ శాఖ, మహిళ శిశు సంక్షేమ శాఖ, రహదారులు, భవనముల శాఖ, నీటిపారుదల, ఆయకట్టు అభివృద్ధి శాఖ, పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా రుణాల, ఆస్తుల పంపిణీ, జిల్లా సంక్షేమ శాఖలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అభివృద్ధి శాఖలు, చేనేత జౌళీశాఖ, చేనేత సహకార సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రదర్శనశాలలను జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్‌తో కలిసి ఇన్నోవేటర్ స్టాల్‌ను ప్రారంభించి ప్రదర్శన శాలలను ఆసక్తిగా తిలకించారు.

140
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles