హోంమంత్రికి ఎమ్మెల్యే ఘనస్వాగతం

Fri,August 16, 2019 12:17 AM

ఖమ్మం, నమస్తే తెలంగాణ: రాష్ట్ర హోం మంత్రి మహమూద్ అలీ ఖమ్మం వచ్చిన సందర్భంగా ఓల్డ్‌క్లబ్ రోడ్‌లోని పోలీస్ గెస్ట్‌హౌస్‌లో ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మంత్రికి పుష్పగుచ్ఛం ఇచ్చి ఘనస్వాగతం పలికారు. అనంతరం కొంతసేపు భేటీ అయ్యి అభివృద్ధిపై చర్చించారు. ఖమ్మం శరవేగంగా అభివృద్ధి జరుగుతున్నదని ఎమ్మెల్యే అజయ్‌ని ప్రశంసించారు.

హోంగార్డుల సమస్యల వినతి...
ఖమ్మం క్రైం: జిల్లా కేంద్రానికి వచ్చిన రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకి హోంగార్డు సమస్యలు పరిష్కరించాలని గురువారం మధ్యాహ్నం ఉమేశ్‌చంద్ర భవన్‌లో హోంగార్డు అసోసియేషన్ బాధ్యులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు పలుఅంశాలను హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌తో మాట్లాడి సమస్యలు పరిష్కరించే విధంగా కృషిచేస్తామని హోంమంత్రి వారికి హామీనిచ్చారు. వినతిపత్రం అందజేసిన వారిలో హోంగార్డ్ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షుడు దామెర రవి, మహ్మద్ రఫీ, విజయ్‌కుమార్, వెంకటేశ్వర్లు ఉన్నారు.

156
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles