జన ఘన మన..

Fri,August 16, 2019 12:22 AM

-రాష్ట్ర మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్
-100 అడుగుల జాతీయపతాకం ఆవిష్కరణ
ఖమ్మం, నమస్తే తెలంగాణ: హైద్రాబాద్ తరహాలో అతి పెద్ద జాతీయ జెండాను ఖమ్మం లకారం ట్యాంక్ బండ్‌పై ఆవిష్కరించడం పట్ల ప్రతి ఒక్కరు గర్వపడాలని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అన్నారు. జాతీయ భావాన్ని పెంపొందించుకునేందుకు ఈ తరహా పతా కాలు జాతీయ ఉన్నతిని, జాతియతను పెంపొందిస్తా యని మంత్రి ఆకాంక్షించారు. ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సం సందర్భంగా ఖమ్మం లకారం ట్యాంక్‌బండ్‌పై ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 100 అడుగుల ఎత్తు, 30 అడుగుల పొడవుతో 20 అడుగుల వెడల్పు గల జా తీయ పతాకాన్ని మంత్రి గురువారం ఉదయం ఆ విష్కరించారు. ప్రత్యేకంగా తయారుచేసిన ఈ పతాకం ఖమ్మం పట్టనానికి ప్రత్యేక శోభను తెచ్చిపెడుతుందని మంత్రి పేర్కొన్నారు. లకారం ట్యాంక్‌బండ్ పై ఆహ్లాదం పంచటంతో పాటు దేశభక్తిని పెంపొందించేందుకు ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్‌కుమార్, జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్ 100 అడుగుల జాతీయ పతాకాన్ని ఏర్పాటుకు ప్రత్యేక చొరవ తీసుకున్నందుకు వారికి మంత్రి అభినందనలు తెలిపారు.

ఖమ్మం లకారం ట్యాం క్‌బండ్ పర్యాటక ప్రాంతంగా విరజిల్లాలని మంత్రి అన్నారు.ఖమ్మం శాసనసభ్యులు పువ్వాడ అజయ్ కుమార్ మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక విధానాల కారణంగా రాష్ట్రం అభివృద్ధ్ది చెందుతుందన్నారు.లకారం ట్యాంక్ బండ్ ఖమ్మం నగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుందన్నారు. జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్‌రాజ్, శాసనమండలి సభ్యులు బాలసాని లక్ష్మీనారాయణ, నగర మేయర్ డాక్టర్ జీ పాపాలాల్, జిల్లా కలెక్టర్ ఆర్‌వీ కర్ణన్, పోలీసు కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్, డిప్యూటీ మేయర్ బత్తుల మురళీ ప్రసాద్, అసిస్టెంట్ కలెక్టర్, ఇంచార్జ్ జిల్లా పంచాయితీ అధికారి హన్మంతు కొడింబా, ఆదర్శ్ సురభి, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ప్రియాంక, నీటిపారుదల శాఖ సూపరింటెండింగ్ ఇంజనీరు పీ ఎ వెంకటకృష్ణ, జిల్లా నీటిపారుదల అధికారి నర్సింహారావు, డిప్యూటీ ఈఈ అర్జున్, నగరపాలక సంస్థ కమిషనర్ జే శ్రీనివాసరావు, కార్పొరేటర్లు కమర్తపు మురళీ,పగడాల నాగరాజు, శ్వేత, నీరజ, కర్ణాటి కృష్ణ, చావా నారాయణరావు, జశ్వంత్, ఎం నాగేశ్వరరావు, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

164
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles