విద్యార్థి దశ నుంచే చట్టాలపై అవగాహనఅవసరం

Sat,August 17, 2019 12:20 AM

తల్లాడ: చట్టాలు, న్యాయ సంబంధమైన విషయాల్లో విద్యార్థి దశ నుంచే అవగాహన పెంపొందించుకోవాలని న్యాయ సేవా సంస్థ జిల్లా కార్యదర్శి, సీనియర్ సివిల్‌జడ్జీ వినోద్‌కుమార్ అన్నా రు. శుక్రవారం మండలపరిధిలోని నూతనకల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బాలల హక్కులపై న్యాయ సేవాసంస్థ సభ్యుడు, సీనియర్ న్యాయవాది ఇమ్మడి లక్ష్మీనారాయణ అధ్యక్షతన అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా జడ్జీ మాట్లాడుతూ సామాన్య ప్రజలకు చట్టాలపై సులభతరమైన విషయ పరిజ్ఞానం పెంపొందించడం కోసం న్యాయ సేవాసంస్థ అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నదన్నారు. బాల లు సామాన్య ప్రజలకు, వ్యవస్థకు వారధులని, ప్రజాస్వామ్య వ్యవస్థలో వ్యక్తుల ఇష్టాలతో పాలన జరుగదని, కేవలం చట్టాల ప్రకారమే పరిపాలన జరుగుతుందన్నారు.

ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా రాజ్యాంగ లక్ష్యాలను దృష్టిలో పెట్టుకొని చేసిన చట్టాలు, శాసనాలు ఎన్నో ఉన్నాయన్నారు. నిరక్షరాస్యత, పేదరికం, ప్రచార లోపం వంటి కారణాల వల్ల ఎంతోమంది ప్రజలకు చట్టాలపై అవగాహన లేకుండా పోయిందన్నా రు. బాలల హక్కు లు, బాలల అక్ర మ రవాణా, బాల కార్మిక వ్యవస్థ, నిర్భంధ ప్రాథమిక విద్య తదితర చట్టాలపై ఆయన అవగాహన కల్పించారు. అనంతరం 6 నుంచి 10వ తరగతి వరకు అత్యధిక మార్కులు పొందిన విద్యార్థులకు నోట్‌పుస్తకాలు, పెన్నులు, 1వ తరగతి విద్యార్థులకు పలకలు బహూకరించారు. కార్యక్రమంలో ఎంఈవో దామోదరప్రసాద్, సర్పంచ్ తూము శ్రీనివాసరావు, ప్రధానోపాధ్యాయుడు వీ.వెంకటేశ్వరరావు, శకుంతల, విద్యాకమిటీ చైర్మన్ అక్బర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

120
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles