రూ.లక్షలోపు రుణాల మాఫీ హర్షణీయం

Sat,August 17, 2019 12:21 AM

ఖమ్మంక్రైం: పోలీస్ శాఖలో అంకితభావంతో పనిచేసిన వారికి గుర్తింపు ఉంటుందని పోలీస్‌కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. 73వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీస్ కమిషనరేట్‌లో వివిధ పోలీస్‌స్టేషన్‌లలో విధులు నిర్వహిస్తూ నిబద్ధతతో ఉత్తమ సేవలు అందించిన 86 మంది పోలీస్ అధికారులను, సిబ్బందిని పోలీస్ కమిషనర్ తఫ్సీర్‌ఇక్బాల్ అభినందించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని స్పెషల్ బ్రాంచ్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఇటీవల జరిగిన ఎన్నికల బందోబస్త్ నిర్వహణతో పాటు ఫంక్షనల్ వర్టికల్స్ ఆధునిక టెక్నాలజీ వినియోగించడం ద్వారా కేసుల్లో పురోగతి సాధించుట, పెట్రోలింగ్, బ్లూక్లోట్స్ బృందాల సేవలలో ప్రతిభ చూపిన పలువురు పోలీస్ సిబ్బందికి సీపీ ప్రశంసాపత్రాలు అందజేశారు.

కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ మురళీధర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు, ఏసీపీలు వెంకట్రావు, రామోజీ రమేశ్ , ప్రసన్నకుమార్, రెహమాన్, జహంగీర్, వెంకటేశ్, రియాజ్, విజయబాబు, స్పెషల్‌బ్రాంచ్ సీఐ సంపత్, రవీందర్ తదితరులున్నారు.

164
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles