పోస్టల్ సేవలు విస్తరించాలి

Sat,August 17, 2019 12:21 AM

కొత్తగూడెం టౌన్: పోస్టల్ సేవలను బ్యాంకులు లేని మారుమూల గ్రామాలు, తండాల వరకు విస్తరింపజేయాలని తెలంగాణ సర్కిల్ చీఫ్ పోస్ట్‌మాస్టర్ జనరల్ బ్రిగేడియర్ బి.చంద్రశేఖర్ (ఐపీవోఎస్)అన్నారు. శుక్రవారం ఉమ్మడి జిల్లాల పోస్టల్ సదస్సును స్థానిక ఐఎంఏ హాల్‌లో నిర్వహించారు. ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ... ఇటీవల కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రమాదబీమా, ఇతర సురక్ష బీమా పథకాలను ప్రవేశపెట్టిందని, వాటిని సమర్ధవంతంగా పోస్టల్ శాఖ ద్వారానే అమలుచేయాలని ఉద్యోగులకు సూచించారు. ప్రధానమంత్రి జీవనజ్యోతి బీమా యోజన వార్షిక ప్రీమియం కేవలం రూ.330కే రూ.2 లక్షల బీమా లభిస్తుందన్నారు. ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన వార్షిక ప్రీమియం రూ.12కే రూ.2 లక్షల బీమా సొమ్ము కూడా లభిస్తుందన్నారు. అటల్‌పెన్షన్ యోజన ద్వారా అతి తక్కువ పెట్టుబడి పెట్టినందున వృద్దాప్యంలో వృద్దులకు అధిక ప్రయోజనాలున్నాయని, దీనిని పోస్టల్ సంస్థ ద్వారా కిందిస్థాయి గ్రామీణస్థాయి వరకు చేరవేయాలని ఆదేశించారు. 0-10 సంవత్సరాల బాలికలకు ఉపయోగకరమైన సుకన్య సమృద్ధి యోజనా పథకంలో మరిన్ని ఖాతాలు ప్రారంభించాలన్నారు.

అందరికీ ఉపయోగపడే గ్రామీణ తపాలా జీవితబీమా (ఆర్‌పీఎల్‌ఐ), తపాలా జీవిత బీమా (పీఎల్‌ఐ), అతి తక్కువ ప్రీమియం నుంచి అతి ఎక్కువ ప్రీమియం వరకు మన శాఖ ద్వారా అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం అసిస్టెంట్ పోస్టుమాస్టర్ జనరల్ సంతోశ్ మాట్లాడుతూ... ప్రజలందరికీ చేరేలా సిబ్బంది చేస్తున్న కృషిని అభినందించారు. ఉమ్మడి జిల్లాల పోస్టల్ సూపరింటెండెంట్ యూ. యలమందయ్య, కొత్తగూడెం బ్రాంచ్ పోస్టుమాస్టర్ జీవీజీ ప్రసాద్‌ల అధ్యక్షతన జరిగిన ఈ సదస్సులో ఉమ్మడి జిల్లాలకు చెందిన కొత్తగూడెం, ఇల్లెందు, భద్రాచలం, సత్తుపల్లి, మధిర పోస్టల్ డివిజన్ల సిబ్బంది, ఏఎస్‌పీలు, ఐటీవోలు, డీపీఎంలు, బ్రాంచ్ పోస్టుమాస్టర్లు, అసిస్టెంట్ పోస్టుమాస్టర్లు పాల్గొన్నారు.

146
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles