గుట్కా ప్యాకెట్ల పట్టివేత

Sat,August 17, 2019 12:22 AM

తల్లాడ: తల్లాడలో గుట్కా ప్యాకెట్లను పోలీసులు స్వాధీనపర్చుకున్నారు. ఎస్సై వరాల శ్రీనివాస్, సిబ్బంది కలిసి శుక్రవారం దాడులు చేశారు. తల్లాడకు చెందిన అన్నవరపు సత్యంబాబు వద్ద 425 అంబర్ ప్యాకెట్లు, నాళ్ల నరసింహారావు వద్ద 225 అంబర్ ప్యాకెట్లు, 180 విమల్ ప్యాకెట్లు, 100 గోవా ప్యాకెట్లు, 40 మేరజ్ ప్యాకెట్లు స్వాధీనపర్చుకున్నారు. వీటి విలువ రూ.9,200. వీరిద్దరిపై కేసు నమోదైంది.

139
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles