ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి...

Sat,August 17, 2019 12:22 AM

కారేపల్లి: ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని గాజులతండాకు చెందిన సైదాంబీ, షేక్ ఖాజాబీ కలిసి శుక్రవారం మధ్యాహ్నం ఆటోలో కారేపల్లికి వెళుతున్నారు. గాజులతండా దాటిన తరువాత, ఎదురుగా వేగంగా వచ్చిన కారు(ఏపీ28 సీఎల్ 8285) ఢీకొంది. ఆటో బోల్తా పడింది. అందులో ఉన్న సైదాంబీ, ఖాజాబీ, డ్రైవర్ శంకర్ తీవ్రంగా గాయపడ్డారు. కారేపల్లిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ నెల్లూరి చందన ప్రథమ చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు.

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles