బీటీపీఎస్ యూనిట్-1లో సింక్రనైజేషన్‌కు ఏర్పాట్లు

Sun,August 18, 2019 02:30 AM

మణుగూరు, నమస్తేతెలంగాణ: మణుగూరు-పినపాక మండలాల్లో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణ పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని టీఎస్‌జెన్కో డైరెక్టర్(సివిల్) ఎ.అజయ్ అన్నారు. ఆయన శనివారం బీటీపీఎస్‌ను సందర్శించి పనులను పరిశీలించారు. అనంతరం జెన్కో కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. అన్నిరకాల పనులు షెడ్యూల్ ప్రకారం వేగవంతంగా జరుగుతున్నాయన్నారు.ఈ నెలలోయూనిట్-1లో సింక్రనైజేషన్, 2, 3 యూనిట్లలో లైటప్ చేసేందుకు పనులను పూర్తి చేస్తున్నామన్నారు. తొలుత యూ నిట్-1లో ఆయిల్‌ద్వారా సింకరైజేషన్ చేసి ,వచ్చే నెలలో కోల్ ద్వారా చేస్తామన్నారు. 2,3,4 యూనిట్స్‌ను కూడా డిసెంబర్‌లో సింకరైజేషన్ చేస్తామన్నారు. అన్ని పనులు షెడ్యూల్ ప్రకారం పూర్తి చేసి విద్యుత్ ఉత్పత్తి చేసేందకు పత్యేక ప్రణాళికను త యారుచేసుకొని ముందుకువెళ్తున్నామన్నా రు.

ఇటీవల కురుస్తున్న భారీ వర్షాల వల్ల పనుల్లో జాప్యం జరిగిందన్నారు. వచ్చే నెల చివరి కల్లా మ్బైల్ క్రషర్ ఏర్పాటు అవుతుందన్నారు. మణుగూరు ఏరియా పీకేఓసీ-4, మణుగూరు ఓ సీ(మల్లెపల్లి)నుంచి రోడ్డు మార్గం ద్వారా కోల్ ట్రాన్స్ పోర్టుకు ఎంఈవోఎఫ్ అనుమతులు వచ్చాయన్నారు. మణుగూరు ఏరియా నుంచి త్వరలోనే రోడ్డు మార్గం ద్వారా కోల్ ట్రాన్స్‌పోర్టు చేసుకుంటమన్నారు. ఈ ప్లాంట్ పూర్తి కాగానే 346 మంది భూ నిర్వాసితులు ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్నారని అందరికి కచ్చితంగా పర్మినెంట్ ఉద్యోగాలు ఇస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా యాష్‌పాండ్ వద్ద మొక్కలు నాటారు. ఈ సమావేశంలో బీటీపీఎస్ సీఈ పిల్లి బాలరాజు,ఎస్‌ఈలు మహేందర్,నాగేశ్వరరావు, వీరేశం,రవీందర్‌లు పాల్గొన్నారు.

125
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles