భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్

Sun,August 18, 2019 02:30 AM


ఐటీడీఏ ప్రతీ సమాచారం తెలుసుకునేందుకే వెబ్‌సైట్భద్రాచలం, నమస్తే తెలంగాణ:ఐటీడీఏ ద్వారా వివిధ శాఖలకు సం బంధించి అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రజలకు నేరుగా, వారి మొబైల్ ఫోన్స్ యాప్ ద్వారా తెలుసుకోవడానికి ఐటీడీఏ వెబ్‌సైట్ ప్రారంభించడం జరిగిందని భద్రాచలం ఐటీడీఏ పీవో వీపీ గౌతమ్ అన్నారు. శనివారం భద్రాచలం ఐటీడీఏ సమావేశ మందిరంలో సమావేశం నిర్వహించారు.

ఈ సమావేశంలో పీవో మాట్లాడుతూ... ఐటీడీఏకి సంబంధించిన ప్రతీ సమాచారం మారుమూల ప్రాంతాలలోని ప్రజలు తెలుసుకొపి వారి సందేహాలను నివృత్తి చేసుకోవడానికి ఐటీడీఏ వెబ్‌సెట్ ప్రారంభించడం జరిగిందని తెలిపారు. ప్రస్తుతం ఇంగ్లిష్‌లో ఉందని, వారంలోపు తెలుగు, ఇంగ్లిష్‌లో ప్రతీశాఖకు సంబంధించిన సమాచారం అందుబాటులోకి తెస్తామన్నారు. సంక్షేమ పథకాల కొరకు దరఖాస్తు చేసుకున్న తరువాత ఎవ్వరిని అడగాలో ప్రజలకు తెలియదని సమాచారం ఆ శాఖకు సంబంధించిన అధికారి పేర్లు, ఫోను నెంబర్ వెబ్‌సైట్‌లో ఉన్నందున సంబంధిత అర్జిదారులు వెబ్‌సెట్ ఓపెన్ చేసి వారికి సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చాన్నారు.

123
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles