వైరా రిజర్వాయర్‌కు సాగర్ జలాలు

Sun,August 18, 2019 02:31 AM

-15.02 అడుగులకు చేరిన నీటిమట్టం
వైరా,నమస్తేతెలంగాణ:వైరా రిజర్వాయర్‌కు సాగర్ జలాలను ఎన్నెస్పీ అధికారులు విడుదల చేశారు. ఇటీవల పాలేరుకు సాగర్ జలాలను అధికారులు విడుదల చేశారు. పాలేరు నుంచి ఎన్నెస్పీ ఎడమ కాల్వలో నీరు ప్రవహిస్తుంది. ఏన్కూరు మండలం తిమ్మారావుపేట గ్రామ సమీపంలోని ఎన్నెస్పీ ఎడమ కాల్వ ఎస్కేపు లాకుల నుంచి శుక్రవారం సాయత్రం వైరా రిజర్వాయర్‌కు నీరు విడుదల చేశారు. సుమారు 23 కిలోమీటర్ల దూరం కాల్వలో నీరు ప్రవహించి శనివారం మధ్యాహ్నానికి వైరా రిజర్వాయర్‌కు చేరుకున్నా యి. ఎస్కేపు లాకులను రెండు అడుగులు ఎత్తు మేరకు ఎత్తారు. సాగర్ జలాలు వస్తుండటంతో వైరా రిజర్వాయర్ నీటిమట్టం క్రమేణ పెరుగుతుంది. శుక్రవారం సాయంత్రం వరకు15 అడుగులు ఉంది. సాగర్ జలాలు రావటంతో శనివా రం సాయంత్రానికి రెండు నీటిమట్టం 2 అంగుళాలు పెరిగి 15.02 అడుగులకు చేరుకుంది.

143
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles