కేసుల పూర్తి సమాచారం

Sun,August 18, 2019 02:32 AM


-సీసీటీఎన్‌ఎస్‌లో అప్లోడ్ చేయాలి
-పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్
ఖమ్మం క్రైం: ఎఫ్‌ఐఆర్ నమోదు నుంచి నేర అభియోగ పత్రం దాఖలు వరకు కేసుల పూర్తి సమాచారం ఎప్పటికప్పుడు క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్స్ (సీసీటీ ఎన్‌ఎస్)లో అప్లోడ్ చేయాల్సిన బాధ్యత స్టేషన్ రైటర్లదేనని పోలీస్ కమిషనర్ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు పోలీస్ స్టేషన్లను, న్యాయవ్యవస్థతో అను సంధానం చేస్తూ నూతనంగా రూపొందించిన ఇంటర్ అపరేబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ (ఐసీజేఎస్)ను సద్వినియోగం చేసుకునేందుకు ఉపయోగ పడే క్రైం, క్రిమినల్ ట్రాకింగ్ నెట్‌వర్క్ సిస్టమ్ అప్లికేషన్ సిస్టమ్‌పై పోలీస్ సిబ్బంది దృష్టిసారించాలన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఏసీపీ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడారు.

భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని కాగిత రహిత సేవలను అందించేందుకు క్వాలిటీ ఆఫ్ డేటాను అప్లోడ్ చేయాలన్నారు. దేశవ్యాప్తంగా నేర సమాచార మార్పిడితో నేరస్తుల సమాచారం మొత్తం ఒకే వ్యవస్థలో లభించడంతో పాటు నేరాల నియంత్రణ సులభతరం చేసేందుకు ఈ గవర్నెన్స్ ద్వారా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన క్రైం అండ్ క్రిమినల్ ట్రాకింగ్ సిస్టమ్‌లో కేసు వివరాలు, ఎఫ్‌ఐఆర్, నేర అభియోగ పత్రాలు ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తే నిందితులకు శిక్ష త్వరాగా పడుతుందన్నారు. సీసీటీఎన్‌ఎస్ అప్లికేషన్‌పై క్రైం రైటర్లకు ఎప్పటికప్పుడు శిక్షణను ఇస్తుండాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో అడిషనల్ డీసీపీ దాసరి మురళీధర్, ఏఆర్ అడిషనల్ డీసీపీ మాధవరావు, ఏసీపీలు వెంకట్రావు, సత్యనారాయణ, రామోజీ రమేష్, రామానుజం, వెంకటేష్, ప్రసన్నకుమార్, విజయబాబు, రియాజ్, ఆర్‌ఐలు నాగేశ్వరరావు, శ్రీనివాస్, రవి, తదితరులు పాల్గొన్నారు.

112
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles