ఫొట్రోగ్రాఫర్ చావా సంపత్‌కు అవార్డులు

Sun,August 18, 2019 02:32 AM

ఖమ్మం ఎడ్యుకేషన్, ఆగస్టు17: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీల్లో ఖమ్మం నగరానికి చెందిన ప్రముఖ ఫొటోగ్రాఫర్ చావా సంపత్ కుమార్‌కు అవార్డుల పంట పండింది. నాలుగు జాతీయ స్థాయి, మరో రెండు రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ప్రభుత్వం అందించే అవార్డులను సొంతం చేసుకున్నాడు. అంతేకాక సంపత్ కుమార్ తాను తీసిన చిత్రాల్లో 21ఫొటోలు జాతీయ స్థాయికి అర్హత సాధించాయని, వీటి లో ఒకటి బంగారు పథకాన్ని సైతం తెచ్చిపెట్టిందని తెలిపారు. కాగా గెలుచుకున్న జాతీయ స్థాయి అవార్డులను విజయ వాడ, ఉత్తరప్రదేశ్ రాష్ర్టాల్లో జరిగే వేర్వేరు కార్యక్రమా ల్లో అందుకోనున్నట్లు పేర్కొ న్నారు. తెలంగాణ ప్రభుత్వం అందించే రాష్ట్ర స్థాయి అవార్డులను ఈ నెల 18న హైదరాబాద్‌లోని ఐటీసీ గ్రాండ్ కాకతీయ హాల్‌లో జరిగే కార్యక్రమంలో సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషీల చేతుల మీదుగా అందుకోనున్నట్లు పేర్కొన్నా రు. ఈ అవార్డులతో పాటు రూ.25వేల క్యాష్ రివార్డు ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని తెలిపారు.

159
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles