డీఎంహెచ్‌వో కళావతీబాయి

Sun,August 18, 2019 02:32 AM

చింతకాని: మండలంలోని నాగులవంచలో వైద్యశిబి రం ఏర్పాటు చేస్తామని జిల్లా వైద్యాధికారిణి కళావతీబాయి అన్నారు. గ్రామంలో శనివారం పర్యటించి సీజనల్ వ్యా ధులు, అంటువ్యాధులు, పరిసరాల పరిశుభ్రత తదితర అంశాల పట్ల గ్రామ ప్రజల్లో అవగాహన కల్పించాలని గ్రామ సర్పంచ్ ఆలస్యం నాగమణికు సూచించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఉదయం సా యంత్రం సమయాల్లో ఒంటిని పూర్తిగా కప్పే దుస్తులు ధరించాలని, అన్ని జ్వరాలు డెంగ్యూ జ్వరాలు కావని, పరీక్షల నిమిత్తం అందుబాటులోని పీహెచ్‌సిలను, జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని సంప్రదించాలని ఆమె గ్రామస్తులకు తెలిపారు. వర్షాకాలంలో వ్యాధుల పట్ల వైద్య సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలని స్థానిక వైద్యసిబ్బందికి ఆమె సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఎంవో డాక్టర్ సైదులు, డీహెచ్‌వో మాధవరావు, ఈవోఆర్డి రామయ్య, సూపర్‌వైజర్ వేమిశెట్టి కృష్ణారావు, వెంకటలక్ష్మి, గ్రామగ్రామ పెద్దలు వంకాయలపాటి సత్యనారాయణ, వెంకట లచ్చయ్య, సిలివేరు సైదులు, ఆలస్యం బసవయ్య, కోల్లి బాబు, పాలకమండలి సభ్యులు, పాల్గొన్నారు.

134
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles