బీమ భరోసా..

Sun,August 18, 2019 02:38 AM

-రైతుబీమాతో బాధిత కుటుంబాలకు అండగా సర్కార్
-ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నేటి వరకు 1,138 మంది రైతుల మృతి
-1,053 కుటుంబాలకు అందిన పరిహారం
-రూ. 5లక్షల చొప్పున 52.65 కోట్లు పంపిణీ
-కుంట భూమి కలిగిన రైతుకు వర్తింపు
-రైతుబీమా పథకానికి ఏడాది పూర్తి
- మరో ఏడాదికి పొడిగింపు
ఖమ్మం వ్యవసాయం, ఆగస్టు14: దురదృష్టవశాత్తు మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ సర్కార్ ప్రవేశపెట్టిన రైతుబీమా పథకం ఆర్థిక భరోసా కల్పిస్తున్నది. ఇంటికి పెద్దదిక్కు చనిపోయిన తరుణంలో ఆ కుటుంబాన్ని ఆదుకోవాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఈ పథకం వందలాది రైతు కుటుంబాలకు ఆసరాగా నిలుస్తున్నది. బీమా ప్రీమియం సైతం ప్రభుత్వమే భరించడం, మధ్య దళారుల ప్రమేయం లేకుండా నేరుగా సదరు రైతు నామినీ అకౌంట్లో పరిహారం జమకావడంతో సదరు కుటుంబాలు వీధిన పడకుండా కాపాడినైట్లెంది. 2018 ఆగస్టు 14వ తేదీ అర్థరాత్రి నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ పథకం. నేటివరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మరణించిన రైతులందరికీ రూ.5లక్షల చొప్పున బీమా పరిహారం అందించింది. వచ్చే ఏడాది సైతం ఈ పథకం కొనసాగించేందుకు గాను తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.

సాగు చేసే రైతులకు అన్ని విధాలా సంపూర్ణ సహకారం అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వం నేడు దేశానికే మార్గదర్శకమైంది. ప్రపంచంలోనే ఏ దేశంలో లేని విధంగా తెలంగాణలో ప్రవేశ పెట్టిన సామూహిక రైతు బీమా బాధిత కుటుంబాలకు భరోసాగా నిలిచింది. రైతన్నకు అండగా ఉండాలనే సదుద్దేశంతో సకాలంలో విత్తనాలు, ఎరువులు అందించటంతో రైతు మొహంలో చిరునవ్వు నింపింది. అదేవిధంగా ఆధునిక పద్ధతిలో సాగు చేసుకునేందుకు యంత్ర పరికరాలు, మద్ధతు ధర కోసం ప్రత్యేక కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో చిన్నాబాధిత కుటుంబాలకు భరోసా..

తలు తొక్కింది. వివిధ కారణాలతో మరణించిన రైతు కుటుంబాల ఆర్ధిక ఇబ్బందులను తొలగించేందుకు రైతుబీమా ప్రవేశపెట్టి అండగా నిలిచింది. ఇందుకోసం తెలంగాణ ప్రభుత్వం జీవితబీమా సంస్థతో ఒప్పందం చేసుకున్నది. ప్రతి యేటా ఒక్కోరైతుకు బీమా ప్రీమియం రూ. 2,771లను ప్రభుత్వమే చెల్లించింది. దీంతో జిల్లావ్యాప్తంగా 2.67 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరినట్లయింది. నేటివరకు ఖమ్మం జిల్లావ్యాప్తంగా 766 మంది రైతులు మృతి చెందగా, వీరిలో వరకు 704మంది రైతు కుటుంబాలకు రూ. 5లక్షల చొప్పున రూ. 35.20 కోట్లు నామి నీ అకౌంట్లో జమ అయ్యాయి. అదేవిధంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లో 378 మంది రైతులు వివిధ కారణాలతో చనిపోగా, 349 మంది రైతు కుటుంబాలకు పరిహారం అం దింది. మిగతావి విచారణలో ఉన్నాయి.

దళారుల ప్రమేయం లేకుండా....
ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ పథకంలో పకడ్బందీ విధివిధానాలను రూపొందించారు. మధ్యదళారులు ప్రమేయం లేకుండా, రైతుకు పైసాఖర్చు లేకుండా పరిహారం నేరుగా అందేవిధంగా రూపకల్పన చేశారు. జిల్లాలోని వ్యవసాయశాఖ విస్తరణ అధికారులు రెండునెలల పాటు అవిశ్రాంతంగా పనిచేసి సంబంధిత రైతు వివరాలను, నామినీ వివరాలను ముందస్తుగానే సేకరించి జీవితబీమా సంస్థకు అందజేశారు. రైతు మరణించిన మరుక్షణమే సంబంధిత ఏఈవో క్షేత్రస్థాయిలో పూర్తి వివరాలతో పాటు మరణ ధ్రువీకరణ పత్రాన్ని ఆన్‌లైన్‌లో పొందుపరుస్తున్నారు. ఈ వ్యవహారాలను పూర్తిస్థాయిలో పర్యవేక్షణ చేసేందుకు ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం గతంలో పట్టాదారు పాస్ పుస్తకాలు అందుకున్న ప్రతిరైతుకు బీమాసౌకర్యం కల్పించటం జరిగింది. జిల్లాలోని వ్యవసాయశాఖ కార్యాలయంలో ప్రత్యేకంగా నోడల్ అధికారులను నియమించారు. దీంతో రైతు మరణించిన పదిరోజుల లోపే నామినీ అకౌంట్‌లోని పరిహారం అందుతుంది.

వచ్చే ఏడాది పొడిగింపు..
రైతుబీమా పథకం (2019-20)సంవత్సరానికి గాను పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేనివిధంగా రైతుబీమా పథకం ప్రవేశపెట్టిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిది. గత సంవత్సరం నుంచి అమల్లోకి వచ్చిన ఈ పథకంతో జిల్లావ్యాప్తంగా వందల రైతు కుటుంబాలకు ఆర్థిక భరోసా కలిగినైట్లెంది. గత సంవత్సరం ఒక్కో రైతుకు బీమా ప్రీమియం క్రింద తెలంగాణ ప్రభుత్వం రూ 2,771 చొప్పున జీవిత బీమా సంస్థకు చెల్లించగా, అయితే ఈ సంవత్సరం జీఎస్టీ ఇతర పన్నులు కలిపి ఒక్కో రైతుకు ఏడాది ప్రీమియం కింద దాదాపు రూ 3,400 చొప్పున చెల్లించారు. రెండో విడుత రైతుబీమా పథకానికి సంబంధించి ఆగస్టు 14నుంచి అమల్లోకి వచ్చింది.

145
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles