రైతులకు వరం బేతుపల్లి జలాలు..

Mon,August 19, 2019 01:24 AM

-ప్రత్యామ్నాయ కాల్వ నీటిని విడుదల చేసిన ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య...
సత్తుపల్లి రూరల్, అగస్టు 18: మండలంలోని పెద్దచెరువైన బేతుపల్లి జలాలు సత్తుపల్లి, వేంసూరు మండల రైతులకు వరమని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం బేతుపల్లి చెరువు పూర్తిస్థాయిలో నిండటంతో ఆయన లాకులు ఎత్తి నీటిని వేంసూరు మండలానికి విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి సారించి రైతన్నలను ఆదుకునేందుకు దేశంలోనే మొదటి సారిగా కాళేశ్వరం ప్రాజెక్ట్‌ను పూర్తి చేసి రైతులకు అందించారన్నారు. గోదావరి నదిపై చేపట్టిన సీతారామ ప్రాజెక్ట్‌ను అతి త్వరితగతిన పూర్తి చేసి రైతులకు త్వరలోనే గోదావరి జలాలను అందించటం జరుగుతుందన్నారు. బేతుపల్లి చెరువు ద్వారా సుమారు 8వేల ఎకరాలకు నీరు అందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీలు దొడ్డా హైమావతి శంకర్‌రావు, పగుట్ల వెంకటేశ్వరరావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, నాయకులు గాదె సత్యం, చల్లగుళ్ల నర్సింహరావు, చల్లగుండ్ల కృష్ణయ్య, కొత్తూరు ఉమామహేశ్వరరావు, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, వెల్ది జగన్మోహన్‌రావు, మాజీ ఎంపీపీ చలారి వెంకటేశ్వరరావు, మట్టా ప్రసాద్, కూసంపూడి మహేష్, వల్లభనేని పవన్, చాంద్‌పాషా,అద్దంకి అనిల్‌లతో పాటు ఐబీడీఈ మరియన్న, ఏఈ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

118
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles