అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి...

Mon,August 19, 2019 01:24 AM

సత్తుపల్లి టౌన్, : గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి సారించి, మౌలిక వసతులు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నట్లు ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. ఆదివారం మండల పరిధిలోని కిష్టారంలో సింగరేణి సేప్‌నిధుల ద్వారా మంజూరైన రూ.65 లక్షలతో మంజూరైన సీసీ రోడ్లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతి పంచాయతీల్లో అంతర్గత రహదారులు, సీసీ రోడ్లు, తాగునీటి సౌకర్యం, వీదిలైట్లు కల్పించడమే ధ్యేయంగా పని చేస్తున్నామని, సింగరేణీ ప్రభావిత ప్రాంతమైన కిష్టారంలో సేఫ్ నిధులతో పూర్తిస్థాయి అభివృద్ధి చర్యలు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ డొడ్డా హైమావతిశంకర్‌రావు, జడ్పీటీసీ కూసంపూడి రామారావు, మాజీ ఎంపీపీ జ్యేష్ట అప్పారావు, సర్పంచ్ చెట్టిమాల రేణుకాఈశ్వర్, ఎంపీటీసీ పాలకుర్తి సునితరాజు, ఉప సర్పంచ్ కొల్లపనేని ధనుంజయ, నాయకులు కొడిమెల అప్పారావు, జువ్వాది అప్పారావు, మారోజు నాగేశ్వరరావు, నరుకుళ్ళ అప్పారావు, గుడ్లూరి రవి, గుడ్లూరి జనార్దన్, ఆదిరెడ్డి, టీఆర్‌ఎస్ నాయకులు చలగుళ్ల నర్సింహరావు, కొత్తూరు ఉమామహేశ్వరరావు, కూసంపూడి మహేష్, మట్టా ప్రసాద్, శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, జ్యేష్ట లక్ష్మణ్‌రావు పాల్గొన్నారు.

117
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles