నిండుకుండలా తాలిపేరు..

Mon,August 19, 2019 01:25 AM

-ప్రాజెక్టులో 73.05 మీటర్ల నీటి నిల్వ
-ఎడమ, కుడి కాలువలకు సాగునీరు సరఫరా
చర్ల రూరల్ : తాలిపేరు ప్రాజెక్టు రిజర్వాయర్‌లోకి ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వరద తగ్గడంతో ఆదివారం అధికారులు గేట్లు అన్నింటిని దించారు. జూలై మొదటి వారంలోనే 5 టీఎంసీల సామర్థ్యం కలిగిన తాలిపేరు ప్రాజెక్టు నిండింది. జూలై 12వ తేదీ నుంచి కాలువల ద్వారా పంట పొలాలకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆనాటి నుంచి డ్యామ్‌లోకి వచ్చే వరదని అంచనావేస్తూ అవసరమైన మేరకు ప్రతీరోజు గేట్లుఎత్తి నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. ప్రాజెక్టులోకి వరద భారీగా వచ్చినపుడు ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 25 గేట్లు ఎత్తి సుమారు 2 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువ గోదావరిలోకి వదిలేసిన సందర్భాలు ఉన్నాయి. సుమారు 40 రోజులుగా డ్యామ్ నుంచి ప్రతీరోజు నీరు విడుదలైంది. ప్రాజెక్టులో ఇన్‌ఫ్లో పడిపోవడంతో గేట్లు మొత్తం దించేసి రిజర్వాయర్‌లో 73.05 మీటర్ల నీటిని నిల్వచేస్తూ ఎడమ కాలువకి 260 క్యూసెక్కులు, కుడి కాలువకి 15 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నట్లు తాలిపేరు ప్రాజెక్టు ఇన్‌చార్జి ఏఈఈ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎగువ నుంచి ప్రాజెక్టులోకి 6,380 క్యూసెక్కుల నీరు వస్తున్నట్లు తెలిపారు. 74 మీటర్ల సామర్థ్యం వరకు డ్యామ్‌లో నీటిని నిల్వ చేయవచ్చన్నారు. వరద పెరిగితే మళ్లీ గేట్లు ఎత్తే అవకాశం ఉంటుందన్నారు. రిజర్వాయర్ నిండుకుండలా కనిపిస్తోంది.

113
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles