వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించుకోవాలి

Mon,August 19, 2019 01:25 AM

కొత్తగూడెం నమస్తేతెలంగాణ: మరుగుదొడ్డి నిర్మించడంతో పాటు దానిని వినియోగించుకోవాలని, అందుకు వారికి అవగాహన కల్పించడం కోసం కలెక్టర్ సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారు. ప్రతి కుంటుంబం వ్యక్తిగత మరుగుదొడ్లు వినియోగించి పరిశుభ్రతను పాటించే విధంగా విద్యార్థులచే పెయింటింగ్ వేయించి అవగాహన కల్పించే విధంగా కలెక్టర్ చేస్తున్న ప్రత్యేక కార్యక్రమం ప్రజలకు ఎంతో దోహదపడనుంది. జిల్లాలో మరుగుదొడ్ల నిర్మాణాలు ఈ నెలాఖరుతో పూర్తిస్థాయిలో పూర్తవుతున్నందున మరుగుదొడ్డి వినియోగంపై ప్రజలను ఆలోచింపజేసే విధంగా పాఠశాలల మరుగుదొడ్లు, ప్రహరీలతో పాటు ప్రభుత్వ భవనాలపై పెయింటింగ్ వేయిస్తున్నారు. ఇందుకోసం విద్యార్థులకు కావాల్సిన పెయింటింగ్స్‌ను, కావాల్సిన సామాగ్రిని విద్యార్థులకు ఉచితంగా అందజేయాలని ఇప్పటికే డీఆర్‌డీఏ పీడీకి సూచించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లోను విద్యార్థులు పెయింటింగ్ వేస్తున్నారు. మరుగుదొడ్డి వినయోగంపై గ్రామస్థాయిలో ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించేందుకు విద్యార్థుల ద్వారా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు.

గ్రామస్థాయి వరకు ఈ కార్యక్రమం ప్రాధాన్యత తెలియజేయుటకు మండల ఎంఈవోలు, ఎంపీడీవోలకు బాధ్యతలు అప్పగించారు. ఎంఈవోలు, ఎంపీడీవోలు సంయుక్తంగా ఈ పెయింటింగ్ కార్యక్రమాలను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేసేందుకు కార్యాచరణ చేపట్టారు. మరుగుదొడ్డి నిర్మాణం పూర్తయిన తదుపరి కూడా కొన్ని కుటుంబాల వారు వినియోగించకుండా ఆరుబయట మల విసర్జన చేయవద్దనే విషయాన్ని ప్రజలకు తెలియజేయడం ఈ పెయింటింగ్ యొక్క ప్రధాన ఉద్దేశంగా పేర్కొంటున్నా రు. గ్రామంలో ఏ ఒక్కరూ మరుగుదొడ్డి వినియోగించకపోయినా పథకం లక్ష్యం నీరుగారిపోతుందని, ఇందుకోసం ప్రతి కుంటుంబం విధిగా మరుగుదొడ్డి వినయోగించాలని ప్రచారం చేయనున్నారు. జిల్లాలో స్వచ్ఛభారత్ మిషన్ గ్రామీణ్, ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టిన మరుగుదొడ్లు నిర్మాణాలు ఈ నెలాఖరుకు పూర్తి కానుండటంతో జిల్లాను బహిరంగ మలవిసర్జన రహిత జిల్లాగా ప్రకటించనున్నారు.

ఈనెలాఖరువరకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తి చేయాలని ఎంపీడీవోలకు ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులు వేసే చిత్రాలు ప్రతి ఒక్కరినీ ఆలోచింపజేసి ఆరు బయట మలవిసర్జనను నియంత్రించే విధంగా ఉండాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గ్రామస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ఈ తరహా కార్యక్రమాన్ని చేపడుతున్నారు.ప్రజలకు స్పష్టమైన అవగాహన వస్తేనే బహిరంగ మలవిసర్జనను పూర్తిగా నిర్మూలించడానికి అవకాశం ఉందని, అందువలన విద్యార్థుల చేత పెయింటింగ్ కార్యక్రమాలను చేపట్టనున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. మండలస్థాయిలో ఎంఈఓలు, ఎంపీడీఓలు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించారు. ప్రతి గ్రామం పరిశుభ్రంగా ఉండాలంటే ముందుగా ప్రతి కుటుంబం మరుగుదొడ్డి వినియోగించడం మనందరి బాధ్యతగా తీసుకోనున్నారు. ప్రతీ ఇంటి నుండి వచ్చే మురుగు నీరు ఆరుబయట వదలకుండా ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసి అందులోకి మల్లించాలని చెప్పారు. ఆరుబయటికి నీరు పంపడం వలన దోమలు వ్యాప్తి చెందుతాయని అన్నారు. విద్యార్దులు వేసే పెయింటింగ్‌ల ద్వారా ప్రజల్లో ఆలోచన రావాలని ఈ కార్యక్రమం చేపడుతున్నారు.

130
Tags

More News

VIRAL NEWS

LATEST NEWS

Cinema News

Health Articles